పేదల రక్తం పీల్చేందుకు వస్తున్న పసుపుపతిని ఎవరూ నమ్మొద్దు: సీఎం జగన్‌

Cm Jagan Aggressive Comments On Chandrababu pawan kalyan At madanapalle Meeting - Sakshi

పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం

2014లో ఈ పసుపుపతి మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు

కుర్చీ కోసం పసుపుపతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు

ఇప్పుడు మరోసారి ఇదే డ్రామా చేస్తున్నారు.

పేదల రక్తం పీల్చేందుకు వస్తున్న ఈ పసుపుపతిని నమ్మకండి

మదనపల్లె బహిరంగ సభలో సీఎం జగన్‌

సాక్షి, అన్నమయ్య జిల్లా :  అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అరుంధతి సినిమాలో పశుపతిలా చంద్రబాబు బయటకొచ్చారని మండిపడ్డారు. పసుపుపతి అయిదేళ్ల తరువాత వచ్చి వదల బొమ్మాళి అంటున్నారని దుయ్యబట్టారు. కుర్చీ కోసం పసుపుపతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆరో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో దారిపోడవునా సీఎం జగన్‌ను జనం నీరాజనాలు పలికారు. మంగళవారం మదనపల్లె బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 2014లో ఈ పసుపుపతి మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడని ప్రస్తావించారు. ముగ్గురి ఫొటోలతో ఉన్న హామీల పత్రాలను ఇంటింటికి పంపించారని, ఆ హామీలను ఒక్కటేనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఇప్పుడు మరోసారి ఇదే డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు.

2014 కంటే ఎక్కువ హామీలంటూ మరో డ్రామాకు తెరతీస్తున్నారని సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్న ఈ పసుపుపతిని ఎవరైనా నమ్ముతారా అని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాన్‌ చేస్తున్నారని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబు తోక కత్తిరించాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే  ఓర్వలేక.. కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్‌ ఇంకా మాట్లాడుతూ..

 • పేదలకు, పెత్తందారులకు కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది
 • పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం
 • ఆ ముఠా నాయకుడి పేరు చంద్రబాబు.
 • జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం.
 • మోసాలే అలవాట్లుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వారితో ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నాం.

గత హామీలు నెరవేర్చారా?

 • గతంలో చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?.
 • పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
 • ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కిందరూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?
 • ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
 • ఉద్యోగం ఇవ్వలేకపోతే.. నిరుగ్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
 • అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
 • రాష్ట్రాన్ని సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తానన్నాడు.
 • ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.  నిర్మించాడా?
 • 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు.. చేశాడా?
 • ప్రజలంతా కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించాలి

జగన్‌ పేరు చెప్తేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకొస్తాయి

 • జగన్‌ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయి
 • రూ. 2లక్షల 70 వేల కోట్ల పేదల ఖాతాల్లో జమ చేశాం.
 • డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల 75 వేల కోట్లు ఇచ్చాం.
 • చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తు రాదు.
 • లంచాలు, వివక్షలేని పాలన అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్‌ పాలన.
 • రైతు భరోసా అంటే గుర్తొచ్చేది మీ జగన్‌ పాలన.
 • ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్‌
 • 2 లక్షల 31 వేల ఉద్యోగాలంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్‌
 • 31 లక్షలపైగా ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేంది.. మీ జగన్‌
 • అమ్మ ఒడి, విద్యా దీవెన అంటే గుర్తు కొచ్చేది.. మీ జగన్‌
 • దిశ యాప్‌ అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్‌
 • 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి.

బాబు గెలిస్తే పెన్షన్లు, పథకాలు, వాలంటరీర్‌ వ్యవస్థ రద్దు చేస్తాడు

 • పేదలంటే చంద్రబాబుకు కక్ష
 • తన మనుషులతో ఈసీకి ఫిర్యాదు చేయించి అవ్వతాతలకు పెన్షన్‌రాకుండా చేయించాడు.
 • పెన్షన్లు ఇవ్వడానికి  వీలు లేదని తన మనుషులతో పిటిషన్‌ వేయించాడు.
 • నిమ్మగడ్డ రమేష్‌తో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి పేదలకు అన్యాయం చేశారు.
 • బాబుకు ఓటు వేస్తే పెన్షన్‌, పథకాలను అందించిన వలంటీర్ల రద్దకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లే.
 • బాబు గెలిస్తే పెన్షన్లు, పథకాలు, వాలంటరీర్‌ వ్యవస్థను రద్దు చేస్తాడు.
 • మీ పెన్షన్‌ మీ ఇంటికి రావాలంటే బాబులాంటి సైంధవులు రాకూడదు.
 • వృద్ధులకు, వికలాంగులకు మంచి చేస్తున్న వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు రద్దుచేయాలన్నారు. 

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top