మోదీకి ఆ సలహా ఇచ్చింది నేనే.. జనం చెవుల్లో బాబు పువ్వులు 

Chandrababu Lies In Naravaripalle - Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్రాంతి పండగకు సొంతూరు నారావారిపల్లెకు వచ్చిన చంద్రబాబు అక్కడా రాజకీయ ప్రసంగాలే చేశారు. భోగి మంట వేయడానికి అని చెప్పి వేకువజామునే రోడ్డుపైకి వచ్చి జీవో నంబర్‌ 1 ప్రతులను తగులబెట్టారు. మూడేళ్ల తరువాత స్వగ్రామానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన.. శనివారం మీడియా సమావేశంలో అర్థంపర్థం లేకుండా మాట్లాడారు.

జీ–20 సదస్సుల్లో ప్రధాని మోదీకి తాను సలహా ఇచ్చానని చెప్పిన చంద్రబాబు.. ఆ సలహా ఏమిటో చెప్పలేదు. ‘అదే 2047.. వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలను జరుపుకోబోతున్నాం. రాబోయే 2047కు ప్రపంచంలోనే తెలుగు జాతిని నంబర్‌–1గా నిలుపుతాను. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ స్థిరపడడానికి నేనే కారణం...’ అంటూ అర్థంలేకుండా మాట్లాడారు.

టెక్నాలజీ శక్తి ఉండడంతో 2047 వరకు యువత మనకు అండగా ఉంటుందని, ఆ తర్వాత మన యువత తగ్గిపోతుందన్నారు. దేశ భవిష్యత్తు కోసం పిల్లలను కనడం మన ధర్మమని చెప్పుకొచ్చారు. దేశంలోనే మొదటిసారిగా జాతీయ రహదారిని తానే ఏర్పాటు చేశానని చెప్పారు.
చదవండి: బెజవాడ సైకిల్‌కు టెన్షనెందుకు?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top