BRS Plans To Contest At Least 75 To 100 Seats At The National Level - Sakshi
Sakshi News home page

BRS Target For Lok Sabha Elections: కారు.. టార్గెట్‌ పదహారు

Jul 26 2023 3:13 AM | Updated on Jul 26 2023 4:41 PM

BRS plans to contest at least 75 to 100 seats at the national level - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏడాది చివరలో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికలపైనా భారత్‌ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ‘కారు.. పదహారు’నినాదంతో బరిలోకి దిగిన బీఆర్‌ఎస్‌ రాను న్న లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే నినాదాన్ని ఎంచుకోనుంది. జాతీయ పార్టీ గా బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన నేపథ్యంలో సొంత రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా 16 లోక్‌సభ స్థానాలనూ క్వీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. 

ఆ రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ పోటీ! 
ఇక మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఇప్పటికే కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. జాతీ య స్థాయిలో కనీసం 75 నుంచి వంద లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీలో నిలిచే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్రతో పాటు ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. 

చేరికలు, పదవుల పందేరంపై దృష్టి 
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ నాలుగు, కాంగ్రెస్‌ మూడు, ఎంఐఎం ఒక్కో స్థానంలో గెలుపొందిన విషయం తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 స్థానాల్లో గెలుపొందడానికి అవసరమైన వ్యూహాన్ని ఆచరణలో పెట్టడంపై కేసీఆర్‌ దృష్టి కేంద్రీకరించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా ఇతర పార్టీ ల నుంచి చేరికలు ప్రోత్సహించడం, సొంత పార్టీ నేతలకు పదవుల సర్దుబాటు, విపక్షాలను బలహీనపరచడం, ఎన్నికల నిధుల సమీకరణ తదితరాలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేస్తున్నారు. 

ఆ రెండు సీట్ల నుంచి మళ్లీ వారిద్దరే? 
తెలంగాణ రాష్ట్ర సమితిగా 2001లో ఆవిర్భవించింది మొదలుకుని ఇప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. మిత్రపక్షమైన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీ న్‌ ఒవైసీ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో గెలుపొందారు. మరోవైపు మల్కాజిగిరి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పోటీ చేసే అవకాశముంది. ఆ తర్వాత జరిగే పరిణా మాల్లో ఈ ఇద్దరు నేతలు తిరిగి అవే స్థానాల నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజిగిరి), తల సాని సాయికిరణ్‌ (సికింద్రాబాద్‌)లు మరోమారు పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. 

ప్రభాకర్‌రెడ్డికి ఈసారి దుబ్బాక అసెంబ్లీ సీటు? 
మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే దుబ్బాక అసెంబ్లీ స్థానంపై ఫోకస్‌ చేసి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మైనంపల్లి రోహిత్‌రావు వంటి పేర్లు కూడా తెరమీదకు వచ్చే అవకాశముంది. పెద్దపల్లి, చేవెళ్ల, నాగర్‌కర్నూలు, ఖమ్మంలో ప్రస్తుత అభ్యర్థులే కొనసాగనుండగా, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌ అభ్యర్థుల పేర్లు రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై ఆధారపడి ఉంటాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.

బీజేపీ, కాంగ్రెస్‌ స్థానాలపై నజర్‌ 
కాంగ్రెస్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్‌ వ్యూ హాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్య క్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని భువనగిరి నుంచి లోక్‌సభకు పంపే యోచనతో నే బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నట్లు పార్టీ వర్గా లు చెప్తున్నాయి.

బీసీ కోటాలో రాష్ట్ర గొర్రె లు, మేకల అభివృద్ది సంస్థ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ భువనగిరి లేదా నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ పేరు ఖరారు కాగా, నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోమారు పోటీ చేయనున్నారు.

ఆదిలాబాద్‌ నుంచి మాజీ గెడాం నగేశ్‌ లేదా ఎన్నికల నాటికి ఉండే పరిస్థితిని బట్టి మరో అభ్యరి్థని కేసీఆర్‌ బరిలోకి దింపే అవకాశముంది. ఇక గతంలోమూడుసార్లు నల్లగొండ ఎంపీగా ప్రాతి నిధ్యం వహించిన శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి మునుగోడు లేదా నల్గొండ అసెంబ్లీ సీటును ఆశిస్తున్నట్టు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement