రాంచందర్‌రావుకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఫోన్‌ | BJP National President calls Telangana Party Chief Ramchander Rao | Sakshi
Sakshi News home page

రాంచందర్‌రావుకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఫోన్‌

Sep 1 2026 3:27 PM | Updated on Sep 1 2026 3:57 PM

BJP National President calls Telangana Party Chief Ramchander Rao

హైదరాబాద్‌:  తెలంగాణలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ అన్న చందంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ఫోన్‌ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడులు, నేతల అరెస్ట్‌లపై ఆరా తీశారు. అదే సమయంలో కాంగ్రెస్‌ నిరంకుశ విధానంపై పోరాటాన్ని కొనసాగించాలని రాంచందర్‌రావుకు నబిన్‌ సూచించారు. 

కాగా, తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల దాడులు, నిరసనలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్న(సోమవారం, ఆగస్టు 31వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు కాంగ్రెస్‌ శ్రేణులు నల్లరంగు వేయగా, ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై, బిహార్‌లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణులు నల్ల రంగు పూయడంపై బీజేవైఎం శ్రేణులు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గాం«దీభవన్‌ ముట్టడికి యతి్నంచారు. గాంధీభవన్‌పై కోడ్డిగుడ్లు విసిరేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  

బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పర నిరసన దాడులతో నల్లగొండ జిల్లా కేంద్రం అట్టుడికింది. శ్రీనగర్‌ కాలనీలో ఉన్న మంత్రి కోమటి­రెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై (వ్యక్తిగత కార్యాలయం) సోమవారం బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నేతృత్వంలో కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అక్కడే ఉన్న మంత్రి ప్లెక్సీకి నిప్పంటించారు. దీంతో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో దేవరకొండ రోడ్డు చైతన్యపురికాలనీలో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడిచేశారు.

ఇదీ చదవండి: 

‘ ఫ్రెండ్లీ పోలీస్‌.. కాంగ్రెస్‌ నేతలకు వత్తాసు పలకడమేనా?’

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement