దోపిడీలో నంబర్‌ వన్‌

Bandi Sanjay Kumar Comments About TRS Government - Sakshi

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బండి సంజయ్‌ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం సంక్షేమంలో నంబర్‌ వన్‌ కాదని, దోపిడీలో నంబర్‌ వన్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణం గా 80 గజాలలోపు నివాస స్థలమున్న పేదలకు ఎలాంటి అనుమతులుండవని, అయితే ప్రస్తుతం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం వారికి కూడా వర్తింపజేయ డం కేసీఆర్‌ ప్రభుత్వ అనాలోచిత విధానాలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం నడపలేని ప్రస్తుత స్థితిని అధిగమించేందుకు పేదలు, మధ్య తరగతి ప్రజల మీద ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను బలవంతంగా రుద్దుతున్నారని విమర్శించారు. 74 ఏళ్లుగా గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు మంజూరు చేసిన లేఅవుట్లు అక్రమమే అయితే అక్రమంగా అనుమతులు మంజూరు చేసిన వారిని, ప్రభుత్వాలను శిక్షించారా.. లేక ఇప్పుడు శిక్షిస్తారా.. అని ప్రశ్నించారు. ‘అవి అక్రమమే అయితే రిజిస్ట్రేషన్‌ శాఖ ఎలా రిజిస్ట్రేషన్‌ చేసింది? మున్సిపాలిటీ రోడ్లు ఎలా వేసింది? విద్యుత్, వాటర్‌ వర్క్స్‌ అనుమతులెలా వచ్చాయి? ప్రభుత్వాలు కళ్లు ఎందుకు మూసుకున్నాయి’ అని దుయ్యబట్టారు. నామమాత్రపు ఫీజులు అని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ని ఆశ్రయిస్తే దాదాపు సగం ప్లాటు అమ్ముకోవాల్సిందేనన్నారు. ఇప్పటికైనా ప్ర భుత్వం కళ్లు తెరిచి ఈ ఆదేశాలను రద్దు చేయాలని, లేదంటే  కేసీఆర్‌ ప్ర జాగ్రహానికి గురికావడం ఖాయమని హెచ్చరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top