బద్వేల్‌లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారు: ఆదిములపు సురేష్‌

Badvel Bypoll 2021: YSRCP Leaders Slams Bjp YSR District Press Meet - Sakshi

సాక్షి, వైఎస్సార్ జిల్లా: ‘‘వైఎస్సార్‌సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, సీఎం జగన్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బద్వేల్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుంటున్నాం. బద్వేల్‌ ఉపఎన్నికలో ప్రలు ఏకపక్ష తీర్పు ఇస్తారు’’ అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. వైఎస్సార్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీజేపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 

‘‘బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు అమలు చేసే అవకాశం ఉన్నా చేయడం లేదు. బీజేపీ పరిధిలో లేని హామీలు ఇస్తున్నారు. బద్వేల్‌లో బీజేపీ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తుందట. రాజ్యాంగం ప్రకారం పూర్తిగా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయి. బద్వేలు ఉప ఎన్నికలో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తారు’’ అని మంత్రి సురేష్‌ ధీమా వ్యక్తం చేశారు. 
(చదవండి: బద్వేలులో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదు: మంత్రి వెల్లంపల్లి)

స్థానిక బీజేపీ నేతలు చెప్పినా రాజీనామా చేస్తా: గడికోట
‘‘నేను ఇసుక వ్యాపారం చేస్తున్నానని సోము వీర్రాజు అంటున్నారు. ఈ ఆరోపణలు నిజమని స్థానిక బీజేపీ నేతలు చెప్పినా రాజీనామా చేస్తా. సోము వీర్రాజు అందుకు సిద్ధమా’’ అని ప్రశ్నించారు చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి. వైఎస్సార్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడారు. ‘‘విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, పోర్టు వంటి హామీలు అమలు చేస్తే మద్దతు ఇస్తామన్నాం. సోము వీర్రాజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదని అర్థమైంది’’ అన్నారు.
(చదవండి: బద్వేలులో టీడీపీ.. బీజేపీకి ఓట్లు వేస్తామంటోంది)

‘‘పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి కేంద్రం బాధ్యత కాదా. సమస్యలపై వైసీపీ, బీజేపీ అభ్యర్థులు బహిరంగ చర్చకు సిద్ధమా. ఏపీకి ఇచ్చిన హామీలు అమలుకు బీజేపీ ప్రయత్నించాలి’’ అన్నారు. 

చదవండి: 'కాంగ్రెస్ చేసిన పాపం దేశంలోనే కనుమరుగయ్యేలా చేసింది'

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top