బీజేపీ దొంగిలిస్తే.. మేం తిరిగి గెలిచాం: సీఎం కేజ్రీవాల్‌

Arvind Kejriwal They Stole It We Won It Back Chandigarh Win - Sakshi

ఢిల్లీ: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్‌ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఆప్‌ కౌన్సిలర్‌ కుల్దీప్‌ కుమార్‌ను చండీగఢ్‌ మేయర్‌గా ప్రకటించింది. సుప్రీం కోర్టు మంగళవారం వెల్లడించిన తీర్పును ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్వాగతించారు.

ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’(ట్విటర్‌ ) వేదికగా సుప్రీం కోర్టు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇటువంటి కఠిన సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన దేశ  అత్యున్నత  న్యాయస్థానానికి ధన్యవాదాలు’అని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన  ప్రతిపక్షాల ‘ఇండియా ఇండియా’తొలి విజయమని అన్నారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ నిరంకుశత్వంతో దొడ్డిదారిలో గెలుపొందాలని ప్రయత్నించిందని మండిపడ్డారు.

ఎ‍న్నికల్లో ముందు బీజేపీ దొంగమార్గంలో గెలిచింది.. కానీ మేము మళ్లీ గెలిచి మేయర్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాం.  ఇది  ఇండియా కూటమికి అతిపెద్ద విజయం. బీజేపీని ఓడించలేమనేవారు.. తెలుసుకోవాలి ఓడిస్తామని.  ఇండియా కూటమి భాగస్వామ్య నేతలకు ధన్యవాదాలు. ఇది చండీగడ్‌ ప్రజల విజయం’అని సీఎం కేజ్రీవాల్‌  అన్నారు.

చదవండి:  చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top