ఇప్పటికే 11 జెడ్పీ పీఠాలు కైవసం

AP: YSRCP Creat New History In ZPTC Elections - Sakshi

13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలు అధికార పార్టీ వశం

సాక్షి, అమరావతి: జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా అన్ని స్థానాల్లో అధికార పార్టీ విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 40 వైఎస్సార్‌సీపీ సొంతం.
గుంటూరు: 57 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్‌సీపీ విజయం
ప్రకాశం: 55 స్థానాల్లో 55 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.
నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది.
విశాఖపట్టణం: 39 స్థానాల్లో 33 వైఎస్సార్‌సీపీ గెలుపు. టీడీపీ ఒకటి, సీపీఎం ఒకచోట గెలిచింది.
విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 28 వైఎస్సార్‌సీపీ కైవసం
అనంతపురం: 62 స్థానాల్లో 60 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ. ఒకటి టీడీపీ, ఇతరులు మరో చోట గెలిచారు.
చిత్తూరు: 65 జెడ్పీటీసీ స్థానాల్లో 43 వైఎస్సార్‌సీపీ విజయం
వైఎస్సార్‌ కడప: 50 స్థానాల్లో 46 గెలిచిన వైఎస్సార్‌సీపీ
కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది.
తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీలకు 20 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది.
పశ్చిమ గోదావరి: 48 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్‌సీపీ కైవసం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top