
దాడులు చేస్తే అరెస్ట్ చేయకుండా సన్మానాలు చేయాలా?. హింసను ప్రోత్సహిస్తే ప్రభుత్వం చుస్తూ ఊరుకోవాలా? అంటూ మంత్రి ప్రశ్నించారు.
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు పవన్ 3 రోజులు కాల్‌షీట్ ఇచ్చారని.. అందులో భాగంగానే విశాఖలో అలజడి సృష్టించారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ‘‘ఏపీలో అతిపెద్ద నగరం విశాఖపట్నం. దేశంలోని నగరాలతో పోటీపడగల నగరం. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ తీసుకుని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులపై దాడులు చేయించారు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అన్ని వర్గాల వారు తరలివచ్చారని’’ అంబటి రాంబాబు అన్నారు.
చదవండి: అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్ కల్యాణ్‌కు అర్థమవుతుందా?
దాడులు చేస్తే అరెస్ట్ చేయకుండా సన్మానాలు చేయాలా?. హింసను ప్రోత్సహిస్తే ప్రభుత్వం చుస్తూ ఊరుకోవాలా? అంటూ మంత్రి ప్రశ్నించారు. అమరావతి పాదయాత్ర పేరుతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో తప్ప మరో చోట అభివృద్ధి జరగడం చంద్రబాబు, రామోజీరావులకు ఇష్టం లేదు. టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశంలో నోటి కొచ్చినట్లు మాట్లాడారు. మా గర్జనకు 10 వేల మంది వచ్చారట.. మీకసలు కళ్లున్నాయా. చంద్రబాబు వాణి వినిపించేదుకే పవన్ విశాఖ వచ్చారని’’ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
మేం గర్జన తేదీ ప్రకటించిన తర్వాతే పవన్ తన పర్యటనను ఖరారు చేశారు. గర్జనకు వచ్చిన ప్రజాదరణను డైవర్ట్ చేయడానికే పవన్ ప్రయత్నం చేశాడు. జనసేన పేరు మార్చుకో.. బాబు సేన.. అహింసా సేనగా పేరు మారు పెట్టుకో. హింసను ప్రేరేపించిన ఏ రాజకీయ పార్టీ బతికిబట్టగట్టిన చరిత్ర లేదు. జనసేన పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలి. విశాఖకు పాలనా రాజధాని వచ్చి తీరుతుంది.. ఇది తథ్యం’’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.