
సాక్షి, అమరావతి: 2014లో టీడీపీ కోసం పని చేసిన జనసేన, అప్పటి టీడీపీ హయాంలో రైతుల పట్ల వ్యవహరించిన తీరు ఎలా ఉందో చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రైతులను నట్టేట ముంచారని, ఆ విషయాన్ని పవన్ మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. రైతులను దగా చేసిన ఘనత చంద్రబాబు, పవన్‌కే దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రైతు రుణమాఫీ చేస్తామని అప్పట్లో హామి ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. మేము 12500 రైతు భరోసా ఇస్తామని 13500 ఇస్తున్నాం.. ఇచ్చిన మాట కన్నా ఎక్కువ ఇచ్చి అంకితభావంతో పనిచేస్తున్నామని, నిజమైన రైతు ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమని కొనియాడారు.