
ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్దమవుతున్న పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మంగళవారం నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జలంధర్ నియోజకవర్గంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో తలపడేందుకు రాష్ట్రంలోని అధికార పార్టీ 'పవన్ కుమార్ టిను'ను బరిలోకి దింపింది. ఈయన శిరోమణి అకాలీదళ్ పార్టీ నుంచి ఆప్ పార్టీలోకి చేరారు. ఇప్పుడు ఎస్సీ కోటా నియోజకవర్గం అయిన జలంధర్ నుంచి పోటీ చేయనున్నారు.
ఆప్ పంజాబ్ ఎంపీ అభ్యర్థులు
- ఫిరోజ్‌పూర్ - జగదీప్ సింగ్ కాకా బ్రార్
- గురుదాస్‌పూర్ - అమన్‌షేర్ సింగ్ (షెర్రీ కల్సి)
- జలంధర్ - పవన్ కుమార్ టిను
- లూథియానా - అశోక్ పరాశర్ పప్పి
📢 Announcement! 📢
— AAP (@AamAadmiParty) April 16, 2024
The Aam Aadmi Party proudly presents its candidates for the upcoming Lok Sabha Elections 2024 in Punjab: pic.twitter.com/zPxvgKw2RL