పెద్దపల్లి | - | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

న్యూస్‌రీల్‌

జిల్లాలో 3.23 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం 6,451 ఇందిరమ్మ ఇళ్లకు రూ.126 కోట్లు విడుదల చేశాం నందిమేడారం గ్రామాన్ని మోడల్‌ సోలార్‌గా తీర్చిదిద్దుతున్నాం ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

7

బుధవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2026

ప్రజాపాలనలో

ప్రగతి పరుగులు

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్‌ విజరమణారావు తెలిపారు. జిల్లాలోని 547 పాఠశాలల ద్వారా సుమారు 37 వేల మందికి విద్య అందుతోందని ఆయన చెప్పారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంలో 96 శాతం హాజరు నమోదవుతోందన్నారు.

రెండోవిడతలో రెండు వేల ఇళ్లు..

ఇందిరమ్మ తొలివిడతలో జిల్లాకు మంజూరైన 6,451 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.126 కోట్లు జమచేశామని ప్రభుత్వ విప్‌ తెలిపారు. రెండోవిడతలో ప్రతీఅసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున 6 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నామని ఆయన చెప్పారు.

మహిళలకు ఆర్థిక తోడ్పాటు

మహిళాశక్తి మిషన్‌ ద్వారా జిల్లావ్యాప్తంగా 6,851 స్వయం సహాయక సంఘాలకు రూ.454.66 కోట్ల బ్యాంక్‌ లింకేజీ, 1,642 సంఘాలకు రూ.52.90 కో ట్ల సీ్త్రనిధి రుణాలు అందించామని విజరమణారావు అన్నారు. 8,909 సంఘాలకు రూ.18.03 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశామని, మహిళా సంఘాల ద్వారా 15 అద్దె ఆర్టీసీ బస్సులు, ఒక మెగావాట్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌, ఒక పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. రంగంపల్లిలోని వీ–హబ్‌ ద్వా రా 376 మందికి శిక్షణ అందించామని అన్నారు.

రైతులకు భరోసా

వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా జిల్లావ్యాప్తంగా 456 మంది రైతులకు రూ.1.92 కోట్ల సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశామని, రైతుభరోసా ద్వారా 1,54,598 మంది రైతులకు రూ. 114.04 కోట్లు విడుదల చేశామని, 2025–26 యా సంగిలో 334 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.767.09 కోట్ల విలువైన 3,23,773 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు.

మోడల్‌ సోలార్‌ గ్రామంగా నందిమేడారం

పీఎం కుసుమ్‌ పథకం కింద 9.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రభుత్వ విప్‌ విజరమణారావు చెప్పారు. పీఎం సూర్యఘర్‌ ద్వా రా 1,094 సోలార్‌ రూఫ్‌టాప్‌లను 7.287 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో 9 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, నందిమేడారాన్ని మోడల్‌ సోలార్‌ గ్రామంగా అభివృద్ధి చేస్తూ రూ.51.28 కోట్లతో 1,486 గృహా లు, 628 వ్యవసాయ పంపుసెట్లకు సోలార్‌ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

నిరుద్యోగులకు అండగా

మెగా జాబ్‌మేళాల్లో 3,515 మంది యువత పాల్గొనగా 933 మందికి ఉద్యోగ అవకాశాలు లభించా యని విప్‌ అన్నారు. అగ్నివీర్‌ శిక్షణ ద్వారా 47 మంది ఎంపికై నట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి విజయరమణరావు కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి పూలమాలలు వేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, డీఆర్వో రాజేశ్వరి, మేయర్‌ మహంకాళి స్వామి, మున్సిపల్‌ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, ఆర్డీ వో గంగయ్య, కలెక్టరేట్‌ ఏవో ప్రకాశ్‌ పాల్గొన్నారు.

సాక్షి పెద్దపల్లి/పెద్దపల్లి: సంక్షేమం,

అభివృద్ధి, సామాజిక న్యాయం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని, ప్రగతిని పరుగులు పెట్టిస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. అదే లక్ష్యంగా జిల్లాను ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన వేడుకలకు విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం జాతీయ పతాకం ఎగురవేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి తదితర కార్యక్రమాల గురించి వివరించారు.

అమరుల త్యాగఫలం

గోదావరిఖని: అమరుల త్యాగాల ఫలితమే తె లంగాణ రాష్ట్ర ఆవిర్బావమని రామగుండం పోలీస్‌కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌లో జాతీయ జెండా ఎగరవేసిన ఆయన.. పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీపీ మాట్లాడారు. శాంతిభ ద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తోందని అ న్నారు. ఒకప్పుడు సమస్యాత్మకంగా ఉన్న అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని తె లిపారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, గో దావరిఖని, మంచిర్యాల, స్పెషల్‌ బ్రాంచ్‌, ట్రాఫి క్‌ ఏసీపీలు రమేశ్‌, ప్రకాశ్‌, నాగేంద్రగౌడ్‌, శ్రీనివాస్‌, ఏవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement