పెద్దపల్లి: అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికై న యువతులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. యువశక్తి ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన యువతులు సిలివెరి శ్రీజ, చిప్ప శశివర్షిణి అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికయ్యారు. వీరిని కలెక్టరేట్‌లో ఆయన మంగళవారం స న్మానించి మాట్లాడారు. దేశ సేవకోసం భారత సైన్యం, వైమానిక దళంలో చేరడం ఎంతో గౌ రవప్రదమైన విషయమన్నారు. వీరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో యువశక్తి ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ లెంకల మహిపాల్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు సేవా పతకాలు
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరే ట్‌లోని ఉత్తమ పోలీసు అధికారులు, సిబ్బంది కి సీపీ అంబర్ కిశోర్ ఝా పతకాలతో సత్కరించారు. ఉత్తమ సేవా పతకం సాధించిన సీసీఆ ర్‌బీ ఎస్‌ఐ మహేందర్‌రెడ్డి, సీసీఎస్ మంచిర్యా ల ఎస్‌ఐ డి.లలిత, బెల్లంపల్లి వన్‌టౌన్ ఏఎస్‌ఐ ఎస్.మహేంద్రపలన్, సేవాపతకాలు సాఽఽధించి న సీసీఎస్ మంచిర్యాల ఎస్‌ఐ సామ్యూల్‌పాల్, మందమర్రి ఎస్‌ఐ ఎన్.శ్రీనివాస్, బెల్లంపల్లి కా ర్ ఆర్‌ఎస్‌ఐ ఎస్.మల్లేశ్, గోదావరిఖని వన్‌టౌ న్ ఏఎస్‌ఐ హెచ్.వెంకటేశ్వరబాబు, ఏఎస్‌ఐ సీ హెచ్ తిరుపతిరెడ్డి, జూలపల్లి హెడ్‌కానిస్టేబుల్ ఎం.విజేందర్‌రెడ్డి, నీల్వాయి హెడ్‌కానిస్టేబుల్ బి.రాజయ్యకు సీపీ పతకాలు అందజేశారు.
ఎన్టీపీసీ చేతికి ‘బీ–థర్మల్’?
రామగుండం: రెండేళ్ల క్రితం మూతపడిన స్థానిక 62.5 మెగావాట్ల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణ బాధ్యల్ని ఎన్టీపీసీ దక్కించుకున్నట్లు సమాచారం. రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఢిల్లీలోని కార్పొరేట్ కార్యాలయం, ఎన్టీపీసీ–నోయిడా, హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు మంగళవారం ఈ ప్లాంట్‌ను సందర్శించడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోది. రామగుండంలోని జెన్‌కో ఇంజినీర్లు వారితో కలిసి పవర్ ప్లాంట్ ఏరియా, యాష్‌పాండ్, కోల్‌ప్లాంట్, మార్షలింగ్ యార్డు, ఉద్యోగ నివాసాలు తదితర ప్రాంతాలు సందర్శించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై పలుమార్లు జెన్‌కో ఎస్‌ఈని వివరణ కోరగా స్పందించలేదు.
ఫిట్‌నెస్ నిరాకరణ సరికాదు
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ – తె లంగాణ ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికులను అనారోగ్య సమస్యల సాకుతో ఫిట్‌నెస్‌కు నిరాకరించడాన్ని మానుకోవాలని కాంట్రాక్టు కార్మికుల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్ ధ న్వంతరి ఆస్పత్రిలోని సీఎంవోకు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్ట్‌తోపాటు పలు లొకేషన్ల లో అనేకమంది కాంట్రాక్ట్ కార్మికులు సంస్థ అ భివృద్ధికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని అ న్నారు. ఐదేళ్లుగా వైద్య పరీక్షల పేరుతో కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విష యం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని వారు కోరారు.
క్షయ నిర్ధారణ పరీక్షలు
పెద్దపల్లిరూరల్: కొత్తపల్లి గ్రామంలో మంగళవారం టీబీ నిర్ధారణ పరీక్షలు చేశారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెమడ, చాతీ ఎక్స్‌రే పరీక్షలు చేసి అవసరమైన వారికి పలు సూచనలిచ్చారు.


