జ్యోతినగర్: ప్రజల ఐక్యత, పురోగతి, ఆ కాంక్షల స్ఫూ ర్తికి ప్రతీక తె లంగాణ అని ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ ముకుల్ రాయ్ అన్నారు. పీటీఎస్ జ్యోతి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన తెలంగాణ వేడుకల్లో కేక్ కట్‌చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సంస్థ పురోగతికి ఉద్యోగులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఎన్టీపీ సీ ఎన్‌బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా, ఎన్టీపీసీ కార్మిక యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణకు గర్వకారణం
ఫెర్టిలైజర్‌సిటీ:
తెలంగాణలోనే ఏకైక యూరి యా ఉత్పత్తి క ర్మాగారం రా మగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అని ఆ సంస్థ యూనిట్ హెడ్ ఎస్‌కే జిందాల్ అన్నారు. ప్లాంట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఆరు రాష్ట్రాల రైతులకు ఏటా సుమారు 12.7 లక్షల మెట్రిక్ టన్నుల నీమ్ కో టెడ్ యూరియా అందిస్తూ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలుస్తోందని ఆయన తెలిపారు.
త్యాగధనులను స్మరించుకోవాలి
పెద్దపల్లిరూర ల్: తెలంగాణ ఉద్యమంలో అ నేకమంది అమరులయ్యారని, వారి త్యాగాలను స్మరించుకోవాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య అన్నారు. స్థానిక బస్టాండ్ సమీప అమరవీరుల స్థూపం వద్ద కమిషనర్ వెంకటేశ్ తదితరులతో కలిసి ఆయన నివాళి అర్పించారు. మున్సిపల్ ఆఫీసులో జాతీయజెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అనేకమంది పాల్గొన్నారని అన్నారు.


