పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: సామర్థ్యానికి మించి మట్టి తరలిస్తున్న లారీలను నిమ్మనపల్లి సర్పంచ్ వేల్పుల రమేశ్ ఆధ్వర్యంలో మంగళవారం అడ్డుకున్నారు. సుమా రు మూడు గంటలపాటు గ్రామస్తులు రో డ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీట రుకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. సామర్థ్యానికి మించి లారీల్లో మట్టి తరలించడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. దెబ్బతిన్న రోడ్లను మర మ్మతు చేయడమే కాకుండా ఇందిరమ్మ ఇళ్లకోసం సగం ధరకే ఇటుకలు సరఫరా చేయాలని బట్టీ యజమానులను డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు.


