బల్దియా క్లీన్‌పై క్యూసీఐ నజర్‌ | - | Sakshi
Sakshi News home page

బల్దియా క్లీన్‌పై క్యూసీఐ నజర్‌

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

● నగరంలో పర్యటిస్తున్న ఢిల్లీ బృందం

కోల్‌సిటీ: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా రామగుండం నగరంలో స్వచ్ఛ తీరు నేరుగా తనిఖీ చేయడానికి ఢిల్లీ నుంచి క్యాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ) ద్వారా ఇప్సోస్‌ అసెసర్‌ సంస్థ ప్రతినిధు లు ప్రదీప్‌, సాయి, మనీష్‌, ప్రదీప్‌ మంగళవారం బల్దియాకు చేరుకున్నారు. వారంపాటు వీరు పర్యటించనున్నారు. తొలిరోజు ఎస్‌ఎల్‌పీ(సర్వీస్‌ లెవల్‌ ప్రోగ్రేస్‌)పై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఎస్‌ఎల్‌పీకి 10,500 మా ర్కులు ఉంటాయి. ఇంటింటా చెత్త సేకరణ, తడి, పొడి చెత్తను వేరు చేస్తున్న వైనంతోపాటు కంపోస్టు యార్డు, డీఆర్‌సీసీ కేంద్రాల పనితీరు, రోడ్ల పరిశుభ్రత, చెత్త వాహనాల వినియోగం తదితర అంశాల పై ఆరా తీశారు. ఇంటింటికీ వెళ్లి శానిటేషన్‌పై పౌ రుల అభిప్రాయాలూ సేకరిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే వివరా లు, ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీరి వెంట ఎన్వరాల్‌మెంట్‌ ఇంజినీరు మధూకర్‌, శ్రీకాంత్‌తోపాటు ఏకో వారియర్స్‌ ప్రతినిధులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement