యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం : ఎంపీ వంశీకృష్ణ | - | Sakshi
Sakshi News home page

యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం : ఎంపీ వంశీకృష్ణ

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

పెద్దపల్లిరూరల్‌: యు వతకు కాంగ్రెస్‌ ప్ర భుత్వం ఉపాధి, ఉ ద్యోగావకాశాలు క ల్పించేలా అనేక చర్య లు చేపట్టిందని పెద్దపల్లి పార్లమెంట్‌ స భ్యుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని కమాన్‌వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి పెద్దపీ ట వేస్తూనే వృత్తినైపుణ్యశిక్షణ ఇప్పించేలా ఏటీసీలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మంత్రి వివేక్‌ ఆధ్వర్యంలో ఏటీసీల్లో శిక్షణ పూర్తిచేసుకున్న వారికి నేరు గా ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ నేతలు తమ స్వార్థప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని ఎంపీ ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బండారి సునీల్‌గౌడ్‌, సజ్జద్‌, బాలసాని సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రహరీ నిర్మాణం ప్రారంభం

మంథని: మున్సిపల్‌లోని నాలుగో వార్డులో నగరాభివృద్ధి నిధుల ద్వారా చేపట్టనున్న ఖబ్రస్తాన్‌ ప్రహరీ పనులను మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైనారిటీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రహరీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఖబ్రస్తాన్‌లో మరిన్ని సౌకర్యా లు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కా ర్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ మద్దికట్ల స్రవంతి, మైనారిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదిరతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement