బంగారు తెలంగాణకు బాటలు | - | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణకు బాటలు

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

గోదావరిఖని: బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు సింగరేణిలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆర్జీవన్‌ జీఎం లలిత్‌కుమార్‌ కోరా రు. జీఎం కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఆయన.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమా ల వేశారు. అనంతరం మాట్లాడారు. ఈసందర్భంగా తెలంగాణ రన్‌ నిర్వహించారు. కళకారు ల నృత్యాలు, భవానీపోతురాజుల వేషాలు, మ హిళల డప్పు చప్పుళ్లు, బోనాలు, కోలాటం, బ తుకమ్మల మధ్య తెలంగాణ రన్‌ కొనసాగింది. కార్యక్రమంలో క్వాలిటీ జీఎం సుజోయ్‌మజుందర్‌, ఎస్‌వోటూ చంద్రశేఖర్‌, సీఎంవోఏఐ కోలా మల్లేశ్‌, ఏజీఎం రామ్మోహన్‌రావు, ఆంజనేయు లు, ప్రాజెక్ట్‌ అధికారి రమేశ్‌, ఏజెంట్లు రమేశ్‌, శ్రీనివాస్‌, అధికారులు ధనలక్ష్మీభాయి, జితేందర్‌సింగ్‌, వరప్రసాద్‌, పర్సనల్‌ అధికారులు రవీందర్‌రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement