జ్యోతినగర్: ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్‌లను బీసీ ఏ జాబితాలో చేర్చాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ కోరారు. మంగళవారం ఆసిఫాబాద్ పర్యటన ముగించుకుని ఎన్టీపీసీ జ్యోతిభవన్‌కు చేరుకున్న ఆయన.. పలువురు నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలోనే తమది అత్యధిక జనాభా అని అన్నారు. నాయకులు బల్ల సత్తయ్య, పిల్లి శివయ్య, సోమన్న, పిడుగు కృష్ణ ముదిరాజ్, దబ్బెట శంకర్ ముదిరాజ్, అప్పరాజు ప్రభాకర్ ముదిరాజ్, గొలుసు జ్యోతి, ముదిరాజ్, మంద రాజేశ్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


