పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/ఓదెల/మంథని: ఆకాశమంత పందిళ్లు.. రంగురంగుల విద్యుత్ దీపాలు.. మామిడి తోరణాలు.. అనేకరకాల పూలదండలు.. అందంగా అలంకరించిన వేదికలు.. అశేష భక్తజనం.. వెరసి శ్రీసీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. జిల్లా కేంద్రం పెద్దపల్లితోపాటు గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్‌తోపాటు వివిధ మండల కేంద్రాలు, గ్రామాల్లో రాములోరి పరిణయ వేడుకలు శుక్రవారం కన్నులపండువగా సాగాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలుచేశారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో స్వామివారల వివాహం వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.


