పెద్దపల్లి హిందూ వాహినితోపాటు పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి రాములోరి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీరామసీతాసమేత లక్ష్మణమూర్తి హనుమ విగ్రహాలతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. మినీ ట్యాంక్ బండ్, జెండాకూడలి, శివాలయం చౌరస్తా, అయ్యప్పగుడి నుంచి బస్టాండ్ వరకు యాత్ర కొనసాగింది. దారి పొడవునా మహిళలు నృత్యాలు చేస్తూ, కోలాటాలు ఆడారు. దీక్షాపరులు, చిన్నారులు సీతారామలక్ష్మణ హనుమ వేషాధరణలతో సందడి చేస్తూ ముందుకు సాగారు. కోల్‌కతా నుంచి వచ్చిన బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిందూవాహిని పెద్దలతోపాటు లింగేశ్వర పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహరాజ్ పాల్గొనగా, ఆదిబట్ల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, సినీనటి కల్యాణి ప్రత్యేక ఆకర్షణగా నలిచారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


