కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు

Mar 28 2026 7:30 AM | Updated on Mar 28 2026 7:30 AM

కోల్‌సిటీ: రామగుండం నగరంలో వరుసగా వీధికుక్కల దాడులు చోటుచేసుకుంటున్నాయి. గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని వ్యాపార కూడళ్లల్లో రోడ్లపై సంచరిస్తూ ప్రజలను తరుముతున్నాయి. తాజాగా బోళ్లబజార్‌లో గురువారం ఓ చిన్నారిపై రెండు వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు స్థానిక జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధికుక్కల దాడులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రోదిస్తున్నబాలిక, కుక్కకాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement