పెద్దపల్లి: విద్యుత్ సంస్థలోని 23,667మంది ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ తూళ్ల నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016కు ముందు అన్నిఅర్హతలు ఉన్న వారందరినీ, ఆన్‌మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్‌లుగా గుర్తించాలన్నారు. అన్నివిభాగాల వారికి జీవో నంబర్11 ప్రకారం కనీస వేతన చట్టం, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 26, 30వ తేదీల్లో డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నా, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట వంటావార్పు చేస్తామని, ఏప్రిల్ 7న వరంగల్ డీసీఎల్ కార్యాలయం వద్ద మహాధర్నా చేస్తామని, అయినా స్పందించకుంటే ఏప్రిల్ 8న నిరవధిక సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌ధిలో పనిచేస్తున్న అర్టిజన్ గడ్డం జయదేవ్‌ను వేధిస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఖలీమొద్దీన్, ఎం.కృష్ణారెడ్డి, ఎం.ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్టిజన్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా జేఏసీ నేత నాగరాజు


