తాళం వేసిన ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Mar 25 2026 6:56 AM | Updated on Mar 25 2026 6:56 AM

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం కల్లెడలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు సోమవారం రాత్రి చోరీకి పాల్ప డ్డారు. గ్రామానికి చెందిన గాండ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి ఉపాధి నిమిత్తం ముంబయ్‌ వెళ్లాడు. దొంగలు చొరబడి పావుతులం బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు.

ఆర్టీసీకే ఎలక్ట్రిక్‌ బస్సులివ్వాలి

గోదావరిఖనిటౌన్‌: ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించి బలోపేతం చేయాలనే డిమాండ్‌తో స్థానిక డిపో ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, నరేశ్‌ మాట్లాడారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతిస్తామని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. విద్యుత్‌ బస్సుల నిర్వహణలో ఆర్టీసీకి ప్రాధాన్యం లేకుండా చేసి దేశీయ, అంతర్జాతీయ ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే పద్ధతులను వ్యతిరేకిస్తున్నామన్నారు. దీంతోపాటు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన పేరుతో ఆర్టీసీలకు ఉన్న భూములను ప్రవేట్‌ సంస్థలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నాయకులు నరహరిరావు, కృష్ణ, మల్లయ్య, రాజేశం, కొమురయ్య, ప్రేమ్‌కుమార్‌తోపాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పి.రంగన్న, మద్దెల శ్రీను, టి.శ్రీను, ఏబీ స్వామి, డీఆర్‌ స్వామి, జి.శ్రీను, సామెల్‌, చంద్రయ్య, ప్రసాద్‌, కె.రవి, రాజయ్య, రాజు, భిక్షపతి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

పోక్సో కేసులో ఒకరి అరెస్ట్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలకేంద్రానికి చెందిన పుట్టకొక్కుల రంజిత్‌ను పోక్సో కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిరిసిల్ల డీఏస్పీ నాగేంద్రచారి తెలిపిన వివరాలు.. రంజిత్‌ కొన్నినెలలుగా రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఓ మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా అనుభవించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాహుల్‌రెడ్డి కేసు నమోదు చేశారు. డీఏస్పీ నాగేంద్రచారి కేసు దర్యాప్తు చేశారు. రంజిత్‌ను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

అట్రాసిటీ కేసు నమోదు

జమ్మికుంట: కులంపేరుతో దూషించిన ఇద్దరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ రామకృష్ణ మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన చంద్రమౌళి ఇంటి స్థలం ఎదుట ఇసుక పోయించిన నూరి రామకృష్ణ, మేడిపల్లి సదానందంను ప్రశ్నించాడు. దీంతో వారు కులంపేరుతో దూషించి, దాడికి యత్నించారు. భాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement