పెద్దపల్లి: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని డీవైఎస్‌వో సురేశ్ సుచించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి పీఎంశ్రీ క్రీడాపోటీలు నిర్వహించారు. అకడమిక్ ఆఫీసర్ పీఎం షేక్, ఎస్‌జీఎఫ్ జి ల్లా కార్యదర్శి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీవైఎస్‌వో సురేశ్ మాట్లాడుతూ, ఆటల్లో మెలకువలు నేర్చుకుని రాష్ట్ర, జాతీ య స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. తద్వారా భవిష్యత్‌లో ఉద్యోగ, ఉ పాధి అవకాశాల్లో రిజర్వేషన్ సౌకర్యం వర్తించే అవకాశం ఉంటుందని అన్నారు. బాల, బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళా పీఈటీలను సన్మానించారు. ప్రతినిధులు శోభారాణి, వే ల్పుల సురేందర్, దాసరి రమేశ్ పాల్గొన్నారు.
రంజాన్ కిట్లు వచ్చేశాయి
పెద్దపల్లి: రంజాన్ సందర్భంగా జిల్లాలోని పేద ముస్లింలకు కిట్లు మంజూరయ్యాయి. ఈమేరకు ఆయా తహసీల్దార్ కార్యాలయాలకు 2,500 కిట్లు వచ్చి చేరాయి. ఒక్కో కిట్‌లో పురుషులకు కుర్తా, పైజామా, వస్త్రం, యువతులకు డ్రెస్ మెటీరియల్, మహిళలకు చీర ఉన్నాయి. ఎమ్మెల్యేలతో వీటిని త్వరలోనే పంపిణీ చేయనున్నామని ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి నరేశ్ కుమార్ నాయుడు తెలిపారు.


