గైర్హాజర్ కత్తి కార్మికుడి మెడపై గోదావరిఖని: గైర్హాజర్ కార్మికుల మెడపై కత్తి వేలాడుతోంది. ప్రస్తుతం ఉద్యోగం రావడమే గగనమైన వేళ.. ఉన్నకొలువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా యువకులే అగ్రస్థానంలో ఉంటున్నారు. సింగరేణిలో సుమారు 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 14 వేల మందికిపైగా యువకులే ఉన్నారు. వయసు పైబడిన కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా రిటైర్మెంట్ తీసుకుని వారిస్థానంలో తమ వారసులకు ఉద్యోగాలు పెట్టిస్తున్నారు. వీరిరాకతో ఉత్పత్తి, ఉత్పాదక మెరుగవుతుందని సంస్థ ఆశిస్తోంది. కానీ, గైర్హాజరే అధికంగా నమోదు కావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
వంద మస్టర్లు నిండనివారు 1,204 మంది
ఏడాదిలో వంద మస్టర్లు నిండని యువ కార్మికులు సింగరేణి వ్యాప్తంగా సుమారు 1,204 మందికిపైగా ఉన్నట్లు యాజమాన్యం గుర్తించింది. వారికి తరచూ కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వస్తోంది. అయినా వారిలో మార్పురావడం లేదు. పాతతరం కార్మికులు ఉన్నంతవరకు ఉత్పత్తి, ఉత్పాదకత బాగానే సాగినా.. యువతరం పనిపై ధ్యాస పెట్టడం లేదని అధికారులు అంటున్నారు.
చాలామంది యువకులు భూగర్భగనుల్లో పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. వీరిలో ఉన్నత చదువులు చదివి పలు రంగాల్లో ఇప్పటికే సెటిల్ అయినవారూ ఉన్నారు. కారుణ్య నియామకాలతో సింగరేణిలో ఉద్యోగాలు వస్తుండటంతో అప్పటికే ఉన్నఉద్యోగాలు వదిలేసి ఇందులో చేరుతున్నారు. ఏసీల కింద కూర్చుని పనిచేసిన వారు.. ఇప్పుడు భూగర్భ గనుల్లోకి వచ్చి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కష్టమైన పనులు కావడంతో చాలామంది విధులకు ఎగనామం పెడుతున్నారు.
సింగరేణిలో ఉద్యోగం సాధించినా కొందరు సాఫ్ట్‌వేర్ రంగంపై మమకారం వదలడం లేదని తెలుస్తోంది. చాలామంది సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే.. సమయం లభించినప్పుడల్లా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు యాజమాన్యం గుర్తించింది. ఇలాంటి వారు 16 మంది ఉన్నట్లు గుర్తించి గతంలోనే యాజమాన్యం నోటీసులు జారీచేసింది.
వరుసగా మూడేళ్లు వందలోపు మస్టర్లు ఉంటే ఉద్యోగులను విధుల నుంచి డిస్మిస్ చేసే అవకాశం ఉంది. యువ కార్మికులు భూగర్భగనుల్లో పని చేసేందుకు ఆసక్తి చూపడడం లేదు. గైర్హాజర్‌తో బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది. సంస్థ ప్రగతికి ఆటంకం ఏర్పడుతోంది. ప్రతీఉద్యోగి విధులపై దృష్టి సారించాలి. సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. వ్యక్తిగత సమస్యలుంటే అధికారులను సంప్రదించి వారి సహకారం తీసుకోవాలి. అంతేతప్ప విధులకు గైర్హాజరు కావొద్దు. – లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ–1
చర్యలకు ఉపక్రమిస్తున్న సింగరేణి ఏడాదిలో వంద మస్టర్లు నమోదు చేయని వారిపై దృిష్టి మూడేళ్లు వరుసగా నిర్దేశిత మస్టర్లు చేయకుంటే ఉద్యోగం నుంచి డిస్మిస్
పంటల పరిరక్షణకు మల్లారం అన్నదాత వినూత్న ఆలోచన కోతులు, అడవిపందుల నుంచి పంటలు కాపాడుకునేందుకు తిప్పలు
సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఇతర వ్యాపకాలు ఉన్న కార్మికులపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇలాంటివారిని గుర్తించేందుకు సింగరేణి విజిలెన్స్ విభాగం నిఘా పెట్టింది. పార్ట్‌టైం ఉద్యోగాలు చేసేవారి వివరాలు సేకరించి యాజమాన్యానికి అందజేస్తోంది. ప్రస్తుతం సింగరేణిలో 7 వేల మందికిపైగా అదనపు కార్మికులు ఉన్నట్లు యాజమాన్యం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కారుణ్య నియామకాలను నిలిపివేసింది. పని సరిగా చేయని వారినీ వదిలించుకోవాలని చూస్తోంది. ఈక్రమంలో గైర్హాజర్ కార్మికులను ఉపేక్షించేది లేదని చెబుతోంది.
సన్మానాలు సంబురాలు
గోదావరిఖని/పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి/మంథని: జిల్లావ్యాప్తంగా ఆదివారం మహిళా దినోత్సవం ఘనంగా జరుకున్నారు. వివిధ రంగా ల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారితోపాటు కొత్తగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న మహిళలనూ సన్మానించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ ఏడోవార్డులో, ప్రభుత్వ ఆస్పత్రిలో వేడుకలు నిర్వహించారు. మంథని ఆర్టీసీ డిపోలో మహిళా ఉద్యోగులను డీఎం శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో సన్మానించారు. అసిస్టెంట్ మేనేజర్ ఏంజిల్, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజాత, మెకానికల్ సూపరింటెండెంట్ ఇక్బాల్, కండక్టర్‌లు సుమలత, మంజుల, కోమల, సరిత, సౌజన్య తదితరులు పాల్గొన్నా రు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కేక్‌కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్యే సతీమణి మనాలిఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య పాల్గొన్నారు.
భూగర్భ గనుల్లో పనులకు విముఖత
సాఫ్ట్‌వేర్‌ను వదలని యువత
వందలోపు ఉంటే డిస్మిస్
ఆర్‌ఎఫ్‌సీఎల్ టౌన్‌షిప్ ద్వారం
ఏరియాల వారీగా గైర్హాజర్ కార్మికుల వివరాలు
కొత్తగూడెం 80
ఇల్లెందు 12
మణుగూరు 39
ఆర్జీ–1 138
ఆర్జీ–2 71
ఆర్జీ–3 18
ఏపీఏ 84
బెల్లంపల్లి 05
మందమర్రి 199
భూపాలపల్లి 162
శ్రీరాంపూర్ 395
కార్పొరేట్ 01
విజిలెన్స్ అధికారుల నజర్