పెద్దపల్లి: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ ద్వారా జిల్లాలోని 7,602 మంది బాలికలకు టీకా వేస్తామన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్, డీసీహెచ్‌ఎస్ శ్రీధర్ మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, వైస్ చైర్‌పర్సన్ ముస్కాన్, ప్రోగ్రాం అధికారులు కిరణ్ కుమార్, శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


