హ్యామర్‌త్రో పోటీల్లో ప్రతిభ పెద్దపల్లిరూరల్: ప్రపంచస్థాయి హ్యామర్‌త్రో పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొన్న పెద్దపల్లి పట్టణవాసి తూముల మనోహర్‌రావు ప్రతిభ కనబర్చి మూడోస్థానంలో నిలిచారు. థాయ్‌లాండ్‌లోని రాచబురిలో జరుగుతున్న ప్రపంచస్థాయి హ్యామర్‌త్రో వెటరన్ పోటీల్లో మనోహర్‌రావు పాల్గొని ప్రతిభ కనబర్చారు. ఆయనను క్రీడాసంఘాల నాయకులు, క్రీడాభిమానులు, స్థానికులు అభినందించారు.
సివిల్స్ ర్యాంకర్ తల్లిదండ్రులకు అభినందన రామగిరి(మంథని): సివిల్స్‌లో 55వ ర్యాంక్‌సాధించిన గుడెల్లి సృజనకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం అభినందనలు తెలిపారు. ఆమె తల్లిదండ్రులు గుడెల్లి రాణి – రాజేశంకు మంత్రి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఐటీఐలో స్వల్పకాలిక కోర్సులు రామగుండం: స్థానిక ఐటీఐలో ఆరు స్వల్పకాలిక శిక్షణ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచ డం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో బేసిక్ కోర్సు ఆన్ సీఎన్‌సీ లేథ్ మెషిన్ ఆపరేషన్, ప్రాసెసింగ్, సీఎన్‌సీ మిల్లింగ్ మెషిన్ ఆపరేషన్ అండ్ ప్రాసెసింగ్, అవేర్‌నెస్ కోర్సు ఆన్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, జూనియర్ రోబోట్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామర్, ఆర్ వెల్డింగ్, బేసిక్ కోర్సు ఆన్ ఎలక్ట్రానిక్ వె హికిల్స్, జూనియర్ ప్రోడక్ట్ డిజైనర్ యూసింగ్ సీఏడీ–2డీ అండ్ త్రీడీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పల్లెలకు నిధులొచ్చాయి పెద్దపల్లి: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కేంద్రప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2023 –24 ఆర్థిక సంవత్సరంలోని బకాయిలను తొలివిడతగా గత జనవరిలో విడుదల చేసింది. తాజాగా మలి విడత సొమ్మును గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమచేసినట్లు డీఎల్‌పీవో దేవకిదేవి తెలిపారు. జిల్లాలోని మొత్తం 263 పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.21.04 కోట్లు విడుదల కాగా.. మండల వారీగా కేటాయించినట్లు ఆమె వివరించారు.
‘పోల్స్’ వారీగా పెట్రోలింగ్
పెద్దపల్లిరూరల్: విద్యుత్ సంబంధిత సమస్యలను సులభంగా గుర్తించేందుకు యూనిక్ పోల్ నంబర్ పెయింటింగ్ చేశామని, ఇకనుంచి పోల్స్‌వారీగా పెట్రోలింగ్ నిర్వహించి సమస్య త్వరితంగా పరిష్కరిస్తామని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్ తెలిపారు. జీఐఎస్ అసెట్ మ్యాపింగ్, ట్రాకింగ్ ప్రక్రియలో భాగంగా 33 కేవీ లైన్లలోని 34 ఫీడర్ల పనులు పూర్తిచేశామన్నారు. సమస్య తలెత్తిన ప్రాంతం, ట్రాన్స్‌ఫార్మర్ వైఫల్యాలను ఇక సులువుగా గుర్తించవచ్చని ఆయన పేర్కొన్నారు.
యువకుడి ఎంపిక
ధర్మారం(ధర్మపురి): పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ సభ్యుడు రేశవేణి రాకేశ్ తమిళనాడు రాష్ట్ర ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌కు ఎంపికై నట్లు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేశ్ తెలిపారు. మై భారత్ (మేరా యువ భారత్) యువశక్తి అసోసియేషన్ నిర్వహిస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వం ఈఅవకాశం కల్పించిందన్నారు. ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే కార్యక్రమాల్లో ప్రతిభను చాటనున్నారు. రాకేశ్ సర్పంచ్ మందాల శ్రావణి, అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధార్థ్, కార్యదర్శి రిషి, ఆదర్శనితిన్, ఇర్ఫాన్, సభ్యులు అభినందించారు.