మహిళలకు ప్రమాదబీమా | - | Sakshi
Sakshi News home page

మహిళలకు ప్రమాదబీమా

Mar 9 2026 7:15 AM | Updated on Mar 9 2026 7:15 AM

● రుణాలు తీసుకునేవారికి వర్తింపు

● రుణాలు తీసుకునేవారికి వర్తింపు

పెద్దపల్లి: మహిళలను కోటీశ్వరులుగా తయారు చే యాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు రూ.5 లక్ష లు ఉన్న రుణాలను ప్రభుత్వం రూ.10 లక్షల వర కు పెంచింది. ఇదేసమయంలో వారికి బీమా సౌక ర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇదేవిషయా న్ని మంత్రి సీతక్క ఇటీవల వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే మహిళా సంఘంలోని స భ్యుల కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున బీమా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటోంది.

రుణాలు తీసుకున్న వారికి..

జిల్లాలో 446 గ్రామైక్య, 11,156 స్వశక్తి సంఘాల్లో మొత్తం 1,14,709 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వీరు రుణం పొందే సమయంలోనే బీమా పాలసీ తీసుకునేలా బ్యాంకర్లు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు గలవారే అర్హులు. ఇలాంటివారు ఇప్పటివరకు 178 మంది బీమా పాలసీ కోసం తమ పేర్లు నమోదు చేసుకుని ఉన్నారు.

మహిళలకు భరోసా : కాళిందిని, డీఆర్డీవో

మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. అందులోని సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం వర్తింపజేస్తోంది. రుణం తీసుకునే సమయంలోనే బ్యాంకర్లు బీమా సొమ్ము జమచేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement