గుట్టపై సాగుకు ప్రోత్సాహం
పెద్దపల్లిరూరల్: గుట్టపై సేద్యం చేయడం..గట్టుసింగారం గ్రామ ప్రత్యేకం. పెద్దపల్లి మండలం సబ్బితం శివారులోని జనరహిత రెవెన్యూ గ్రామంగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న గట్టుసింగారం గుట్టపై తనకున్న 32 ఎకరాల్లో ఆయిల్‌పాం పంట సాగుకు రైతు దుగ్గెంపూడి రవీందర్‌రెడ్డి ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని ఉద్యానవన అధికారి జగన్మోహన్‌రెడ్డి, రైతు రవీందర్‌రెడ్డి కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం గుట్టపై సాగును పరిశీలించేందుకు కలెక్టర్ వచ్చారు. గుట్టపైకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌పై కలెక్టర్, ఉద్యానవన అధికారి, సదరు రైతు చేరుకున్నారు. అక్కడి వాతావరణాన్ని కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఆయిల్‌పాం సాగుకు ముందుకొచ్చే రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. గుట్టపై సాగు చేసే రైతాంగానికి అవసరమైన విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ.9లక్షలు కేటాయించి పనులు పూర్తి చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
మంథని: జిల్లాలో వచ్చే ఏడాదిలో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరినదికి మహా పుష్కరాలు జరుగుతాయన్నారు. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లకు ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


