తుది సంగ్రామం | - | Sakshi
Sakshi News home page

తుది సంగ్రామం

Dec 17 2025 6:40 AM | Updated on Dec 17 2025 6:40 AM

తుది

తుది సంగ్రామం

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

పార్లమెంట్‌లో నిరసన

గోదావరిఖని: ఉపాధిహామీ పథకం పేరు మా ర్పును వ్యతిరేకిస్త్తూ పార్లమెంట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ ఎంపీలు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. పథకంలోని మహాత్మాగాంధీ పేరు తొలగించాలనే ప్రయత్నం రాజ్యాంగంపై చేసిన దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధిహామీ కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదని, ఇది పేదలకు పని, గౌరవం, జీవన భద్రతకు హామీ ఇచ్చిన రాజ్యాంగపరమైన హక్కు అని ఆయన అన్నారు.

ప్రణాళిక ప్రకారం అభివృద్ధి

గోదావరిఖని: ప్రణాళిక ప్రకారం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఆయన స్కూటీపై పర్యటించారు. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సహకారంతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలకు అనుగుణంగా నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. వైకుంఠ ధామాన్ని సందర్శించి సౌకర్యాలు, నిర్వహణపై ఆరా తీశారు. నాయకులు మహంకాళి స్వామి, సింగరేణి శ్రీనివాస్‌, పెద్దెల్లి ప్రకాశ్‌, సమ్మక్క ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాలికలకు టీకా వేస్తాం

పెద్దపల్లి: గర్భాశయ క్యాన్సర్‌ నియంత్రణ కోసం 14ఏళ్ల వయసు గల బాలికలకు టీకా వే స్తామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వా ణిశ్రీ తెలిపారు. తన కార్యాలయలో వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్‌వైజర్లకు టీ కాపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. జిల్లా వై ద్యాధికారి మాట్లాడుతూ, బాలికలు ముందస్తుగా టీకా తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్‌ దరి చేరదని, ఈ విషయంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు కిరణ్‌కుమార్‌, సుధాకర్‌రెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప లు ఆస్పత్రులు తనిఖీచేశారు. ప్రైవేట్‌ ఆస్పత్రు లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఆమెవెంట డాక్టర్‌లక్ష్మీభవాని, డిప్యూటీ మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రోడ్డు పనుల పరిశీలన

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో చేపట్టిన బీటీ రోడ్డు పనులను మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ మంగళవారం పరిశీలించారు. సుమారు రూ.70 లక్షల అంచనా వ్యయంతో కొనసాగుతున్న పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రైనేజీ నిర్మాణం, కొత్త విద్యుత్‌ స్తంభా ల బిగింపు తదితర పనులు పూర్తిచేశామని తెలిపారు. బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే జెండా చౌరస్తా వరకు బైపాస్‌ అందుబాటులో వస్తుందని ఆయన చెప్పారు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ సతీశ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నరేశ్‌, వినయ్‌, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,383

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7383 ధర పలికింది. కనిష్టంగా రూ.6,073గా నమోదైంది. సగటు రూ. 7,171గా ఉందని మార్కెట్‌ ఇన్‌చారి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం 975 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.

సాక్షి పెద్దపల్లి: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగనున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. లెక్కింపు పూర్తికాగానే ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. పెద్దపల్లి, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్‌ మండలాల్లోని పంచాయతీలకు బ్యాలెట్‌ బాక్స్‌తోపాటు సరిపడా బ్యాలెట్‌ పేపర్లను తీసుకుని ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు మంగళవారం సాయంత్రమే తరలివెళ్లారు.

ఆరు సర్పంచ్‌లు ఏకగ్రీవం..

మూడోవిడతలో 91 సర్పంచ్‌ స్థానాలకు 6 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 85 స్థానాలకు 300 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 852 వార్డులకు 215 ఏకగ్రీవంకావడంతో మిగిలిన 636 వార్డులకు 1,797మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి మండలం రాంపల్లి, సుల్తానాబాద్‌లో నారాయణరావుపల్లి, గొల్లపల్లి, రామునిపల్లి, ఓదెల మండలంలో పిట్టలఎల్లయ్యపల్లి, ఎలిగేడులో ర్యాల్‌దేవ్‌పల్లి గ్రామాలు ఏకగ్రీవం అయినవాటిలో ఉన్నాయి.

పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది..

ఎన్నికల అధికారులు ఆయా మండల కేంద్రాల్లో సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ చేశారు. అక్కడి నుంచి ఆయా పోలింగ్‌ కేంద్రాలకు మంగ ళవారం రాత్రికే సిబ్బంది చేరుకున్నారు. రూట్‌మ్యా ప్‌ ప్రకారం బూత్‌ల గదులను ఏర్పాటు చేసుకు న్నారు. పంచాయతీ కార్యదర్శులు వారికి కావా ల్సిన వసతులను కల్పించారు. అసిస్టెంట్‌ ఎన్నికల అధికారులు పోలింగ్‌ సిబ్బందిని తరలించడానికి బస్సులను ఏర్పాటు చేశారు. పోలీస్‌ బందోబస్తు నడుమ ఎన్నికల అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సురక్షితంగా చేరుకున్నారు.

మద్యం, మాంసం పంపిణీ

పోలింగ్‌కు ముందు ఓటర్లకు అభ్యర్థులు తాయిలాలను పంచిపెట్టారు. చివరి రెండురోజులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పోటాపోటీగా మద్యం, చికెన్‌, మటన్‌ పంపిణీ చేశారు. ఈ రెండు రోజుల్లోనే రాత్రివేళల్లో విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేశారు. ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా అభ్యర్థుల స్థాయిని బట్టి ప్రలోభాల పంపిణీ జరిగింది. ఒక అభ్యర్థి ఓటుకు రూ.500 ఇస్తే, మరొకరు రూ.1,000 చొప్పున పంపిణీ చేశారు. ఒక్కొక్క ఓటుకు క్వార్టర్‌ మద్యం పంచితే, మరొకరు హాఫ్‌ బాటిల్‌ మద్యం అందించినట్లు తెలిసింది. సర్పంచ్‌, వార్డుల అభ్యర్థులు కొన్నిచోట్ల ఉమ్మడిగా, మరికొ న్నిచోట్ల వేర్వేరుగా పంచిపెట్టారు. ఇంకొందరు నేరుగా ఓటర్ల ఫోన్‌నంబర్లు తీసుకొని రూ.500, రూ.1,000 చొప్పున ఫోన్‌పే, గూగుల్‌ పే చేస్తున్నా రు. కొన్నిచోట్ల ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3వేల చొప్పున గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేశారు.

సిబ్బందికి సూచనలు

సుల్తానాబాద్‌రూరల్‌: మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు అన్నిఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్‌ వేణు తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశా లోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని మంగళవారం ఆయ న తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ పూర్తికాగానే ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తామని ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు తెలిపారు.

అప్రమత్తంగా ఉన్నాం

ఓదెల(పెద్దపల్లి): స్థానిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ సూచించారు. స్థానిక పోలీసులతో మంగళవారం వారు సమావేశమై పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలి, మలివిడతల మాదిరిగా చివరిదశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, సీఐలు సుబ్బారెడ్డి, ప్రసాదరావు, ఎస్సైలు రమేశ్‌, వెంకటేశ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమం

పెద్దపల్లి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉ ద్యమం చేస్తామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) జోన్‌ ఎన్నికల పరిశీలకుడు వీరమ ల్ల వెంకటరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో సరస్వతీ శిశుమందిర్‌ పాఠశాలలో మంగళవారం స మావేశం నిర్వహించారు. ఆయన మాట్లాతూ, ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించాలన్నారు. 2010 కన్నా ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మోడల్‌ స్కూల్‌ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని కోరారు. అనంతరం తపస్‌ జిల్లా అధ్యక్షుడిగా ముస్కుల సునీల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గుండవేని జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జోన్‌ ఎన్నికల పరిశీలకుడు వెంకటేశ్‌ పాల్గొన్నారు.

మూడోవిడత సమాచారం

పంచాయతీలు 85

సర్పంచ్‌ అభ్యర్థులు 300

వార్డులు 636

అభ్యర్థులు 1797

పోలింగ్‌ కేంద్రాలు 91

ఓటర్లు 1,44,563

పీవోలు 128

ఏపీవోలు 166

జోన్‌లు 16

రూట్లు 35

వెబ్‌కాస్టింగ్‌ కేంద్రాలు 67

జిల్లాలో నేడు చివరిదశ పోలింగ్‌

సర్వం సిద్ధం చేసిన అధికారులు

గ్రామాలకు తరలిన పోలింగ్‌ సిబ్బంది

గెలుపు కోసం అభ్యర్థుల భారీ ఖర్చు

పటిష్ట బందోబస్తు చేపట్టిన పోలీస్‌లు

ఉదయం 7గంటల నుంచే..

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని నాలుగు మండ లాల్లో బుధవారం ఉదయం 7గంటలకే పోలింగ్‌ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. వార్డుకో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులో 67 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించి, అక్కడ వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేసింది.

హోరాహోరీగా పోరు..

పంచాయతీ స్థానాలకు హోరాహోరీగా పోరు జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచార రథాలతో చిన్నపల్లెల్లోనూ ఈసారి ఎన్నికల ప్రచారం నిర్వహించడం గమనార్హం. కొన్ని పంచాయతీల్లో ముఖాముఖి పోటీ జరుగుతుండగా, మరికొన్నిచోట్ల బహుముఖ పోటీ సాగుతోంది. 2,500 మంది ఓటర్లు మొదలు.. దాదాపు 4వేల మంది ఓటర్లుగల పంచాయతీల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్‌, రాఘవాపూర్‌, పెద్దకల్వల, తుర్కలమద్దికుంటతోపాటు మిగతా మండలాల్లోని ఒకట్రెండు పంచాయతీల్లో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది.

ఉపసర్పంచ్‌ గిరీపై కన్ను..

పంచాయతీల్లో వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారిలో.. ఎలాగైనా ఉపసర్పంచ్‌ గిరీ దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నవారే అధికమంది ఉన్నారు. అందుకే వార్డు సభ్యుడిగా ఎలాగైనా ఎన్నిక కావాలనే ఆశతో ఓటర్లకు ఎన్నడూ లేనివిధంగా ఒక్కో ఓటుకు రూ.400 మొదలు రూ.వెయ్యి దాకా నజరానా అందిస్తున్నట్లు సమాచారం. ఉపసర్పంచ్‌కు సర్పంచ్‌తోపాటు చెక్‌పవర్‌ ఉండడంతోనే ఆ పదవికి అంతటి ప్రాధాన్యం పెంచిందని రాజకీయ విశ్లేషకులు పలువురు భావిస్తున్నారు.

పాపా.. ఇదేమిటి?

పెద్దపల్లిరూరల్‌/పెద్దపల్లి: ‘పాపా.. ఇదేమిటి చెప్పు.. ఇందులోని అక్షరాలు ఏమిటో చదువు’ అని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఓ చిన్నారిని ఆప్యాయంగా పలకరించడం అక్కడున్నవారిలో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రీప్రైమరీ స్కూల్‌ విద్యార్థులకు యూనిఫామ్‌, లర్నింగ్‌ మెటీరియల్‌, ఆటవస్తులను కలెక్టర్‌ అందజేశారు. ఈసందర్భంగా చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. భావిభారత పౌరులను క్రమశిక్షణతో తీర్చిదిద్దేలా బలమైన పునాది వేసేందుకు ప్రీప్రైమరీస్కూళ్లు దోహదపడతాయని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 58 ప్రీప్రైమరీ స్కూళ్లు ఉన్నాయని, వీటికి అదనంగా మరో 5 పీఎంశ్రీ పాఠశాలలు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.

తుది సంగ్రామం1
1/9

తుది సంగ్రామం

తుది సంగ్రామం2
2/9

తుది సంగ్రామం

తుది సంగ్రామం3
3/9

తుది సంగ్రామం

తుది సంగ్రామం4
4/9

తుది సంగ్రామం

తుది సంగ్రామం5
5/9

తుది సంగ్రామం

తుది సంగ్రామం6
6/9

తుది సంగ్రామం

తుది సంగ్రామం7
7/9

తుది సంగ్రామం

తుది సంగ్రామం8
8/9

తుది సంగ్రామం

తుది సంగ్రామం9
9/9

తుది సంగ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement