పకడ్బందీ ఏర్పాట్లు చేశాం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/ఓదెల/సుల్తానాబాద్‌రూరల్: జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల మండలాల్లో బుధవారం జరిగే మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు అన్నిఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఓదెల మోడల్ స్కూల్, ఎలిగేడు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. చివరి విడతలో 91 పంచాయతీలు, 852 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశామని, ఇందులో 6 సర్పంచ్, 215 వార్డులు ఏకగ్రీవమయ్యాయని అన్నారు. మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని, ఈమేరకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఆయన చెప్పారు. ఎన్నికల అధికారులు విధులను పకడ్బందీగా నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీరబుచ్చయ్య, తహసీల్దార్లు రాజయ్య, యాకన్న, బషీరొద్దీన్, ధీరజ్ తదితరులు ఉన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీసీపీ రాంరెడ్డి హెచ్చరించారు. పోలీసు సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. సుల్తానాబాద్, ఓదెల తదితర మండలాల్లో పర్యటించారు. ఎన్నికల బందోబస్తుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన


