పులి ఎక్కడుంది?
రామగుండం: మూతపడిన సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు పరిసరాలు, గోదావరి నదీతీరంలో రెండురోజుల పాటు సంచరించిన పులి ఆనవాళ్లు గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు మూడో రోజు మంగళవారం కూడా అన్వేషణ కొనసాగించా రు. అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీప గోదావరి నది, రామునిగుండాల శివారు, పాములపేట, ఆబాది రామగుండం, లింగాపూర్ సమీప సింగరేణి ఓబీ కుప్పలు తదితర వన్యప్రాణులు సంచరించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో గాలింపు చర్య లు చేపట్టారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తిరుమల సతీశ్‌కుమార్ నేతృత్వంలో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశా రు. ఆయా ప్రాంతాల్లో పులి సంచరించినట్లు ఆనవాళ్లు ఏమీ లభించలేదని వారు తెలిపారు. అయి నా.. పులి సంచరిస్తున్నట్లుగానే భావిస్తూ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అటవీశాఖ అధికారులు కోరారు. పులిని బందించే వరకు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఫారెస్టు ఉన్నతాధికారులు జి.కొమురయ్య, పి.దేవదాస్, సయ్యద్ రహ్మతుల్లాతోపాటు యానిమల్ ట్రాకర్స్ సెర్చ్ బృందాలు అన్వేషణలో పాలుపంచుకుంటున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
గాలిస్తున్న అటవీఅధికారులు
మూడు బృందాలుగా అన్వేషణ
మూడోరోజు కనిపించని ఆనవాళ్లు


