రండి.. ఓటేయండి
పెద్దపల్లిరూరల్: ఓటుహక్కు కలిగిఉన్న పల్లెవాసులు అందరూ ఓట్లు వేసేలా అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది. వివిధ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది మంగళవారం ఎన్నికల సామగ్రితో బయలు దేరి సాయంత్రం వరకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో ఎన్నికల అధికారులు, సిబ్బంది చేరుకున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో 636 పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని చేర్చేందుకు 16 జోన్లు ఏర్పాటు చేసి 35 రూట్లుగా విభజించారు. 59 బస్సుల్లో సామగ్రి, సిబ్బందిని తరలించారు.
వరండాల్లోనే పోలింగ్ కేంద్రాలు..
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం కొన్నిచోట్ల వరండాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే మరికొన్ని పాఠశాలల్లో అవసరమైనన్ని గదులు అందుబాటులో లేకపోవడంతో ఒకేగది ఆవరణలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రానికి, ఈ కేంద్రానికి మధ్య టేబుళ్లను ఉంచారు. ఏ వార్డు ఓటరు ఆ వార్డు బూత్‌కే టేబుల్ మధ్య నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది
రండి.. ఓటేయండి


