కాంగ్రెస్ పాలనలో విధ్వంసం
గోదావరిఖని: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసమే కొనసాగిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పాలన సాగిందన్నారు. రెండేళ్ల ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పాలనపై చార్జీషీట్ విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. కూల్చివేతల తో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని, వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్‌లో తవ్వకాలతో వ్యాపారం కుంటుపడిందన్నారు. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటుందని, కానీ రామగుండంలో తన హయాంలో చేప ట్టిన ఒక్కపని కూడా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పూర్తిచేయలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.వందల కోట్లను ఈ ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో కూడా తెలియని పరిస్థితి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఉన్న డ్రైనేజీలనే తవ్వడం, సెంటర్ లైట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించడం, కొత్త పోల్స్ వేయడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన విధ్వంసం, కూల్చివేతలు, ప్రశ్నించే గొంతులను అణిచివేయడం, కక్షసాధింపులు, కేసులు బనాయించడం తప్ప ఏమీ సాధించలేదన్నారు. అర్ధరాత్రి గుడులు కూల్చిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, ఈపాలనకు చరమగీతం పాడాలని చూస్తున్నారని అన్నారు. సమావేశంలో నాయకులు మూల విజయారెడ్డి, జనగామ కవితసరోజిని, నూతి తిరుపతి, బుర్రి వెంకటేశ్, కిరణ్‌జీ, సట్టు శ్రీనివాస్, గుర్రం పద్మ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్


