మహిళల తీర్పే కీలకం
తుదివిడతకు పటిష్ట బందోబస్తు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మూడోవిడతగా పంచాయతీలకు ఈనెల 17న నిర్వహించే ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. చివరి విడతలో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లోని 91 పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఇందులో ఆరు పంచాయతీలు ఏకగ్రీవం కా వడంతో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాలకు పోలింగ్ ని ర్వహిస్తారు. మొత్తం 1,44,563 మంది ఓటర్లు త మ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 73,669 మంది మహిళా ఓటర్లుండగా.. 70,892 మంది పురుష ఓటర్లు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. మహిళా ఓటర్ల కటాక్షం కోసం అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. గ్రామాల్లోని స్వశక్తి సంఘాల మహిళలతో సమావేశాలు నిర్వహించి తమకే మద్దతు ఇవ్వాలంటూ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో చివరి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పెద్దపల్లి జోన్‌లోని మూడోవిడతలో సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలు, మంచిర్యాల జోన్ పరిధిలోని భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐదుగురు లేక అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడవద్దని, అత్యవసరమైతే అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకు ని చట్టబద్ధంగా సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈఉత్తర్వులు ఈ నెల 15 న సాయంత్రం 5గంటల నుంచి ఈనెల 17న ఎ న్నికల ప్రక్రియ కౌంటింగ్ ముగిసేంత వరకూ అమలులో ఉంటుందని ఆయన వివరించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చరించారు. ఓటర్లు అందరూ ఓటు వేయాలని ఆయన కోరారు.
పెద్దపల్లి: చివరిదశ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని డీపీవో వీరబుచ్చయ్య సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్టిబ్యూషన్ సెంటర్‌ను ఆయన సోమ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పోలింగ్ విధులు నిర్వ
హించాలలని ఆయన కోరారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలిస్తున్న డీపీవో
మూడోవిడత ఎన్నికల్లో ఓటర్ల వివరాలు
మండలం మొత్తం ఓటర్లు మహిళలు పురుషులు
పెద్దపల్లి 50,986 25,996 24,989
ఎలిగేడు 18,570 9481 9088
ఓదెల 35,807 18,219 17,588
సుల్తానాబాద్ 39,200 19,973 19,227
మొత్తం 70,892 73,669 70,892
మహిళల తీర్పే కీలకం
మహిళల తీర్పే కీలకం
మహిళల తీర్పే కీలకం


