సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై దృష్టి
పెద్దపల్లి: తల్లిదండ్రులతోపాటు సీనియర్ సి టిజన్ల సంక్షేమం లక్ష్యంగా లీగల్ ఎయిడ్ క్లిని క్‌లు ప్రారంభిస్తున్నామని, వీటిని సద్వినియో గం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సీనియర్ సి టిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను సోమవారం జడ్జి ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ సోమవారం ప్యానల్ న్యాయవాది ఎస్.అశోక్ కుమార్, లీ గల్ వలంటీర్ ఎస్.మల్లేశ్ క్లినిక్‌లో అందుబాటులో ఉంటారన్నారు. తమ పిల్లలతో సమస్య లు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు ఇక్కడ ఫి ర్యాదు చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, ఎఫ్‌ఆర్‌వో స్వర్ణలత, ప్రతినిధులు శేఖర్, అశోక్ పాల్గొన్నారు.
రైల్వేమంత్రి దృష్టికి సమస్యలు
రామగుండం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సోమవారం రైల్వేస్టేషన్లలో సమస్యలను ఆ శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రిని కలిసి న మంత్రి.. రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లిలోని రైల్వే కార్మికులకు మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేయాలని, రామగుండంలో వి విధ కారణాలతో మూతపడిన పాఠశాలను తె రిపించాలని, రైల్వే డిస్పెన్సరీకి అంబులెన్స్ కే టాయించాలని, బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో తొలగించిన అంబేడ్కర్ విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించారు. కుందనపల్లి, పెద్దంపేటలో రైల్వే వంతెనల టెండర్ ప్రక్రియను పూర్తిచేయించాలన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు.
జాతీయ పోటీలకు ఎంపిక
జూలపల్లి(పెద్దపల్లి) : మండల కేంద్రా నికి చెందిన అక్షయ్‌రాజ్ వాలీబాల్ పో టీల్లో జాతీయ స్థా యికి ఎంపికయ్యా డు. 2024లో స్పో ర్ట్స్ అథారిటీ ఆఫ్ తె లంగాణ అకాడమీ కి ఎంపికై .. సీనియ ర్ కోచ్ సంపత్‌గౌడ్ వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. క్రీడాకారులు హన్మంతరెడ్డి, కొసరి కృష్ణ, కమలాకర్‌రెడ్డి, రవీందర్, గంగాధర్‌గౌడ్ ఆయనను సోమవారం అభినందించారు.
సాధువులకు సన్మానం
మంథని: గోదావరి పరిక్రమణ యాత్రలో భా గంగా యానాం నుంచి ధర్మపురి వెళ్తున్న పలువురు సాధువులకు సోమవారం పట్టణంలో ఘ నస్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని వింద్రావన్ పీఠానికి చెందిన మలూక్‌పీత్ శ్రీరాజేంద్రదాస్‌జీ మహారాజ్‌తోపాటు పలురాష్ట్రాలకు చెందిన సాధువులు, మండేశ్వరులు, మహామండలేశ్వరులు సుమారు 500 మంది తొలుత కాళేశ్వరం సందర్శించారు. ఆ తర్వాత ధర్మపురి వెళ్తుండగా మంథనిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, మంథని ప్రఖండ ఉపాధ్యక్షుడు రావుల సతీశ్, ప్ర చారక్ తూర్పాటి రాము, సత్రంగ ప్రముఖ మే డగోని రాజమౌళిగౌడ్, బోట్ల ఆంజనేయులు, బత్తుల సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
రామగిరి(మంథని): ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండలని భద్రతా తనిఖీ బృందం క న్వీనర్ వెంకటరమణ అన్నారు. ఆర్జీ–3 ఏరి యా ఓసీపీ–2లో సోమవారం నిర్వహించిన వార్షిక భద్రతా పక్షోత్సవాల్లో జీఎం సుధాకర్‌రావుతో కలిసి మాట్లాడారు. గతాను భవాలను దృష్టిలో పెట్టుకుని విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఆర్జీ రీజియన్ సేఫ్టీ జీఎం మధుసూ దన్, ప్రతినిధులు రామచంద్రరెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రామ్మోహన్, రాజశేఖర్, శంకర్, చంద్రశేఖర్, రామారావు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై దృష్టి
సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై దృష్టి
సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై దృష్టి
సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై దృష్టి


