ఆరా తీస్తూ.. అడ్రస్ తెలుసుకుంటూ
పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ప్రతీఒక్క ఓటు కీలకమేనని భావించిన సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు.. ఉపాధి కోసం దూర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన ఓటర్లపై దృష్టి సా రించారు. ఓటరు జాబితా ఆధారంగా వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. వలస ఓటర్లు ప్రస్తుతం ని వాసం ఉంటున్న చిరునామాలు సేకరించి ఓటు హక్కు వినియోగించునేందుకు రప్పించేలా ఏర్పా ట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. పోటీ తీవ్ర తను బట్టి ఒక్కఓటుతో ప రాజయం పాలైన వారుకూ డా ఉండడంతో జాబితాలో ని ఓటర్లు అందరూ ఓట్లు వేసేలా చూసేందుకు నానాపాట్లు పడుతున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారిపై దృష్టి..
ఇరుగు, పొరుగు జిల్లాల్లో వలస ఓటర్లు ఉంటే తమ బంధుగణాన్ని అక్కడకు పంపించి వాహనంలో రా వాలని, అందుకయ్యే ఖర్చు తామే భరిస్తామని, ఇంకా ఇతరత్రా కూడా కొంత సమకూర్చుతామంటూ అభ్యర్థులు ఆఫర్ ఇస్తున్నారు. దీంతో చాలామంది వలస ఓటర్లు సైతం తమ ఊళ్లకు వచ్చి ఓటేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫోన్‌లో అందుబాటులో ఉన్నవలస ఓటర్లకు సొమ్మును ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లించి వారినే వాహనం సమకూర్చుకుని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న అభ్యర్థు లూ ఉన్నారు. వలస ఓటర్ల కరుణతోనైనా పంచా యతీ ఎన్నికల్లో గట్టెక్కుతామేమోనన్న గంపెడాశ తో అభ్యర్థులు ఎంతఖర్చుకై నా వెనుకాడడం లేదు.
చివరి విడతలో 91 పంచాయతీలు..
పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని సుల్తానాబాద్, ఎలిగే డు, పెద్దపల్లి, ఓదెల మండలాల్లో 91 పంచాయతీ లు, 852 వార్డు స్థానాలకు ఈనెల 17న ఎన్నికలను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో ఆరు పంచాయతీ సర్పంచ్, 215 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగ తా 85 సర్పంచ్, 636వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు ప్రణాళిక రూపొందించారు. 85 సర్పంచ్ స్థానాలకు 294 మంది, 636 వార్డు స్థానాలకు 1,582 మంది అభ్యర్థులు పోటీపడు తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శతవిధాలా ప్రయ త్నాలు చేస్తున్నారు.
ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర..
పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల కోసం పోటీపడుతున్న అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పల్లెల్లోనూ ప్రచార రథాలను ఏర్పాటు చేసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. సోమవారం (ఈనెల15)తో ప్రచార పర్వం ముగిసింది. బుధవారం చివరి దశ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నగదు, మద్యం, చీరలు పంపిణీ చేసే పనిలో అభ్యర్థులు, వారి మద్దతుదారులు తలమునకలయ్యారు.
మద్యం దుకాణాల మూసివేత
మూడోవిడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 17న జరగనున్నాయి. దీంతో మద్యం దుకాణాలను సో మవారం సాయంత్రమే మూసివేయించినట్లు ఎక్సై జ్ అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు విఘాతం కలుగకుండా మద్యం దుకాణాలు మూసివేయించినట్లు వారు వివరించారు.
పెద్దపల్లి మండలం భోజన్నపేట
గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వలస వెళ్లింది. ఈనెల 17న పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలు ఉండడంతో ఓటేసేందుకు రావాలని ఓ అభ్యర్థి వారికి విన్నవించారు. రానుపోను రవాణా ఖర్చులను ఫోన్‌పే ద్వారా పంపించారు. దీంతో ఆ కుటుంబం ఇటీవలే స్వగ్రామానికి చేరుకుంది.
వలస ఓటర్లను సొంతఊళ్లోకి రప్పించి ఓటు వేయించుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు నానాపాట్లు పాట్లుపడుతున్నారు. దూరాన్ని బట్టి వాహనాలను సమకూర్చుతున్నారు. కొందరు బస్సు, రైలు చార్జీలు చెల్లిస్తున్నారు. వలస ఓటర్లను ఎలాగైనా రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.


