కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్‌రూరల్/ఎలిగేడు: పల్లెలు, పట్టణాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, నిట్టూరు, పెద్దకల్వల, సుల్తానాబాద్ మండలం సుద్దాల, కనుకుల, తొగర్రాయి, కదంబాపూర్‌తోపాటు ఎలిగేడు మండలం నర్సాపూర్, రాములపల్లి, ముప్పిరితోటలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వసతుల కల్పన, కొత్త రేషన్‌కార్డులు, సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ సర్కార్ ఘనతేనని అన్నారు. ఈనెల 17న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులనే గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. అభ్యర్థులు ఆరె సంతోష్, అర్కుటి ధనలక్ష్మి, గిర్నేని స్రవంతి, ఢిల్లేశ్వర్‌రావు, మీస లక్ష్మి, చిలుక స్రవంతి, గొస్కుల సదయ్య, పల్లెర్ల వెంకటేశ్‌గౌడ్, సిద్ధి తిరుపతి, రామిడి శైలజ – వెంకట్రామ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, నాయకులు పడాల అజయ్‌గౌడ్, పెగడ రమేశ్, సంతోష్, సంపత్‌రావు, దుగ్యాల సంతోష్‌రావు తదితరులు పాల్గొన్నారు.


