వీ హబ్ పనులు పూర్తిచేయండి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: వీ హబ్ భవనం పెండింగ్ పనులు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రంగంపల్లిలో చేపట్టిన వీ హబ్ భవన నిర్మాణ ప్రగతిని ఆయన సోమవారం పరిశీలించారు. సీసీ కెమేరా లు, ఏసీలను త్వరగా బిగించాలని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శిక్ష ణ, అవగాహన కల్పించడం లక్ష్యంగా వీ హబ్ భవ నం నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కాళిందిని, పంచాయతీరాజ్ అ సిస్టెంట్ ఇంజినీర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.


