మేడిపల్లి నుంచి లింగాపూర్ వైపు..
గోదావరి తీరంలోనే సంచరిస్తున్న పులి ఆనవాళ్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు ఆందోళన చెందుతున్న గ్రామస్తులు, రైతులు
గోదావరిఖని/రామగుండం: మూతపడిన సింగరే ణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు పరిధిలోని గోదా వరి తీరంలో ఆదివారం సంచరించిన పులి.. సోమ వారం లింగాపూర్ గ్రామ శివారులో ప్రత్యక్షమైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మేడిపల్లి, మల్కాపూర్ గ్రామ శివారుల నుంచి లింగాపూర్ గ్రామ శివారులోని గోదావరి పంపుహౌస్ పరిసరాల్లో తిరిగినట్లు పులి అడుగుజాడలు గుర్తించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
అనుకూలంగా అటవీప్రాంతం..
సింగరేణికి చెందిన మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు మూతపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన అట వీ ప్రాంతంగా వృద్ధి చెందింది. ఇది పులికి నివా సయోగ్యంగా మారినట్లు అధికారులు చెబుతున్నా రు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి.. గోదావరి నదిదాటి మేడిపల్లికి చేరుకుందని, ఆ తర్వాత లింగాపూర్ గ్రామ శివారులోకి వచ్చిందని వారు భావిస్తున్నారు.
ఒంటరిగా వెళ్లొద్దు..
గోదావరి నదీపరీవాహక ప్రాంతాల్లోని గ్రామస్తులు రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రాకూడదని అట వీ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైన వా రు, రైతులు తప్పనిసరైతే.. అలజడి చేస్తూ సామూహికంగా వెళ్లాలని వారు పేర్కొంటున్నారు. సోమ వారం పులి పాదముద్రలు గుర్తించిన వారిలో కా ళేశ్వరం ఫారెస్ట్ సర్కిల్ అధికారి ప్రభాకర్, జిల్లా అ టవీశాఖ అధికారి శివయ్య, అధికారులు ఎంవీ నా యక్, కొమురయ్య, సయ్యద్ రహ్మతుల్లా, మంగీలాల్, స్రవంతి, రామ్మూర్తి తదితరులు ఉన్నారు.


