చెయ్యెత్తి.. జైకొట్టి.. | - | Sakshi
Sakshi News home page

చెయ్యెత్తి.. జైకొట్టి..

Dec 15 2025 10:19 AM | Updated on Dec 15 2025 10:19 AM

చెయ్య

చెయ్యెత్తి.. జైకొట్టి..

సాక్షి పెద్దపల్లి:

లివిడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ ఆధిక్యం ప్రదర్శించింది. అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 73 పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయగా.. మూడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో కాంగ్రెస్‌ మద్దతుదారులు బొట్లవనపర్తిలో సంగ రంజిత్‌కుమార్‌, బంజేరుపల్లిలో కల్లె ఇందిర, బీఆర్‌ఎస్‌ బలపరిచిన షైనేని రవి నాయకంపల్లిలో ఏకగ్రీవంగా గెలుపాందారు. మిగిలిన 70సర్పంచ్‌ స్థానాలకు 286 మంది అభ్యర్థులు పోటీపడగా, 684వార్డుల్లో 177వార్డులు ఏకగ్రీవమయ్యారు. మి గిలిన 507 వార్డుల్లో 1,417మంది పోటీపడ్డారు. ఏ కగ్రీవంతో కలుపుకుని 49 స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు సత్తాచాటారు. బీఆర్‌ఎస్‌ 18 స్థానాల తో సరిపెట్టుకుంది. బీజేపీ బోణీకొట్టింది. 5చోట్ల స్వతంత్రులు, అంతర్గాం మండలం ఎక్లాస్‌పూర్‌లో సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ అభ్యర్థి గెలుపొందారు.

పల్లెల్లో కాంగ్రెస్‌ జోరు

మొత్తం 70 స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు సింహభాగం స్థానాలను దక్కించుకున్నారు. ఏకగ్రీవ మైన స్థానాలతో కలిపి మొత్తం 49 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.

రెండోస్థానానికే పరిమితమైన బీఆర్‌ఎస్‌

తొలివిడత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ద్వితీయ స్థానానికి పరిమితమవ్వగా, రెండోవిడతలో తలపడి రెండోస్థానానికే పరిమితమైంది. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల తో పోల్చితే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌.. స్థానిక ఎన్నిక ల్లో ద్వితీయ స్థానంతో పట్టును నిలుపుకుంది. రెండోవిడతలో ఏకగ్రీవంతో కలుపుకు ని 18సీట్లు గెలుపొందింది. జూలపల్లిలోని 13 సర్పంచ్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి 8 సీట్లు సాధించింది.

బోణీ కొట్టిన బీజేపీ..

తొలివిడతలో ఖాతా కూడా తెరవని బీజేపీ.. రెండోవిడతలో జూలపల్లి మండలం కోనరావుపేటలో తన మద్దతుదారు విజయంతో బోణీ కొట్టింది. అక్కడ బీజేపీ మద్దతుతో నల్లా నరేందర్‌రెడ్డి సర్పంచ్‌గా గెలుపొందారు. ఎంపీ ఎన్నికల్లో ద్వితీయ, టీచర్స్‌, గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ స్థానంలో నిలిచి సీట్లను కై వసం చేసుకున్న బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లో డీలా పడింది.

రెండోవిడత 84.15 శాతం

పల్లె ఓటర్లు ఓటెత్తారు. రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటుహక్కు పొందిన యువత ఉ త్సాహంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నా రు. పోలింగ్‌ పూర్తయ్యాక మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. వార్డుల వారీగా తొ లుత ఫలితాలు ప్రకటించి, అనంతరం సర్పంచ్‌ ఫ లితాలు వెల్లడించారు. అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 70 పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డుస్థానాలకు పోలింగ్‌ జరిగింది.

ఏజెంట్ల రాక ఆలస్యంతో..

పలుచోట్ల పోలింగ్‌ ముగిసిన తర్వాత భోజన వి రామం ప్రకటించారు. ఆ తర్వాత ఏజెంట్లు సకాలంలో లెక్కింపు కేంద్రాలకు చేరుకోలేదు. దీంతో ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల బ్యాలెట్‌ పేపర్లను వేరుచేసి 25 బ్యాలెట్‌ పేపర్లకు ఒకకట్టగా కట్టారు. ఆ తర్వాత అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించారు. ముందుగా వార్డు స్థానాల ఫలితాలు ప్రకటించారు. అనంతరం సర్పంచ్‌ ఫలితాలు వెల్లడించారు. ఓట్లు తక్కువగా ఉన్న చిన్నగ్రామ పంచాయతీల్లో సాయంత్రం ఐదు గంటల వరకే ఫలితాలు వెల్లడయ్యాయి. మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామ పంచాయతీల్లో ఫలితాలు కాస్త ఆలస్యంగా వచ్చాయి.

1.88 శాతం పెరిగిన పోలింగ్‌..

వణికించే చలితో ఓటర్లు పొద్దున కాస్త ఆలస్యంగా పోలింగ్‌ కేంద్రాలకు కదిలివచ్చారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్‌.. గడువు ముగిసే స మయానికి పెరుగుతూ వచ్చింది. గడువు ముగిసిన పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లను ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారు లు అనుమతించారు. ఉదయం 9 గంటలకు 23.94 శాతం, ఉదయం 11 గంటలకు 55.20 శాతం, పోలింగ్‌ ముగిసే సమయానికి 84.15 శాతం పోలింగ్‌ నమోదైంది. తొలివిడతలో 82.27శాతం పోలింగ్‌ నమోదుకాగా, మలి దశలో 1.88శాతం పెరిగింది.

గుర్తింపు కార్డులేక.. ఫోన్లు అనుమతించక

బీఎల్‌వోలు ఓటర్లకు పోల్‌చీటీలను ముందుగానే పంపిణీ చేశారు. అయినా, పలువురు ఓటర్లు పోల్‌ చీటీలతోపాటు గుర్తింపుకార్డులు తీసుకునిరాలేదు. దీంతో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు వారిని అనుమతించలేదు. ఇలాంటివారు మళ్లీ ఇళ్లకు వెళ్లి తమ గుర్తింపుకార్డులు తీసుకొని వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ఫోన్లు అనుమతించలేదు. విష యం తెలియక ఫోన్లతో తరలివచ్చిన పలువురు ఓ టర్లు వాటిని పోలింగ్‌ కేంద్రాల బయ ట ఉన్నవారికి అప్పగించారు. ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థి పేరు లేకుండా కేవలం గుర్తు మాత్రమే ఉండడంతో కొందరు ఓటర్లు ఓటు వేసేందుకు తికమకపడ్డారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా రెండోదశ పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో ముగిసింది.

రామగుండం : కుందనపల్లి పోలింగ్‌ కేంద్రం ఎదుట ఓటర్ల సందడి

ధర్మారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు

ఓటుహక్కు వినియోగించుకున్న ఐఏఎస్‌ అధికారి పరికిపండ్ల నరహరి, పలువురు యువ ఓటర్లు

రెండోవిడత పోలింగ్‌ వివరాలు

మండలం మొత్తం ఓట్లు పోలైనవి శాతం

అంతర్గాం 17930 15455 86.20

ధర్మారం 42447 35178 82.88

జూలపల్లి 24163 20590 85.21

పాలకుర్తి 28118 23584 83.88

మొత్తం 1,12,658 94807 84.15

గెలుపొందిన వివిధ పార్టీల మద్దతుదారులు

మండలం జీపీలు ఏకగ్రీవం కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బీజేపీ ఇతరులు

పాలకుర్తి 16 0 14 02 0 0

అంతర్గాం 15 0 12 01 0 2

జూలపల్లి 13 0 03 08 1 1

ధర్మారం 29 3 18 06 0 2

మొత్తం 73 3 47 18 1 5

చెయ్యెత్తి.. జైకొట్టి.. 1
1/7

చెయ్యెత్తి.. జైకొట్టి..

చెయ్యెత్తి.. జైకొట్టి.. 2
2/7

చెయ్యెత్తి.. జైకొట్టి..

చెయ్యెత్తి.. జైకొట్టి.. 3
3/7

చెయ్యెత్తి.. జైకొట్టి..

చెయ్యెత్తి.. జైకొట్టి.. 4
4/7

చెయ్యెత్తి.. జైకొట్టి..

చెయ్యెత్తి.. జైకొట్టి.. 5
5/7

చెయ్యెత్తి.. జైకొట్టి..

చెయ్యెత్తి.. జైకొట్టి.. 6
6/7

చెయ్యెత్తి.. జైకొట్టి..

చెయ్యెత్తి.. జైకొట్టి.. 7
7/7

చెయ్యెత్తి.. జైకొట్టి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement