పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ

Dec 15 2025 10:19 AM | Updated on Dec 15 2025 10:19 AM

పోలిం

పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ

జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని 13 పంచాయతీల్లో ఆదవారం జరిగిన ఎన్నికల సరళిని అ దనపు కలెక్టర్‌ వేణు పర్యవేక్షించారు. ఓటర్లు ఉ దయమే ఓటువేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. మొత్తం 130 పోలింగ్‌ కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. జూలపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ వేణు పర్యవేక్షించి పలు సూ చనలు చేశారు. ఇన్‌చార్జి డీల్‌పీవో దేవకి, డి ప్యూటీ కలెక్టర్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ బానవాత్‌ వనజ, ఎంపీడీ పద్మజ, డిప్యూటీ తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు. ఏఆర్‌డీఎస్పీ ప్రతాప్‌, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్‌కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

మంత్రిని కలిసిన సర్పంచులు

ముత్తారం(మంథని): కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు శనివారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు. కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. సర్పంచులకు మంత్రి శుభకాంక్షలు తెలిపారు. కొత్త సర్పంచులు పెగడ తిరుమలకుమార్‌, ఇండ్ల కృష్ణావేని– సదయ్య, బియ్యని శివకుమార్‌, తాని ప్రభాకర్‌, సిలివేరి జ్యోతి – లక్ష్మణ్‌, చొప్పరి సంపత్‌, మెంగని స మత – తిరుపతి, బొంతల అన్నపూర్ణ – ఉపేందర్‌, రాపెల్లి రాజయ్య, గడ్డం రాజేశం మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

ధాన్యం గోల్‌మాల్‌పై నిరసన

ముత్తారం(మంథని): కేశనపల్లి ఐకేపీ కొనుగో లు కేంద్రంలో ధాన్యం గోల్‌మాలైందని ఓ రైతు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశాడు. బాధితు డు తాత కుమార్‌కు మద్దతుగా మాజీ సర్పంచ్‌ నూనె కుమార్‌తోపాటు స్థానికులు ఐకేపీ అధికారులను నిలదీశారు. కుమార్‌ 30 బస్తాల ధా న్యాన్ని తూకం వేసి వేరే రైతు ఖాతాలో జమచేశారని ఆరోపించారు. ఎన్నికల వేళ రైతులు స్పందించలేదని, లారీలో తక్కువ ధాన్యం ఉండడంతో వేరే రైతు ఆ ధాన్యం తనవే అని చె ప్పడంతో తూకం వేశామని ఐకేపీ అధికారి తి రుపతి తెలిపారు. బాధిత రైతుకు తెలియకుండా కాంటా వేయడం పొరపాటేనని, ధాన్యం డబ్బులు ఆయనకే వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతు అందోళన విరమించాడు.

ఢిల్లీ ర్యాలీలో ‘ఖని’ నేతలు

గోదావరిఖనిటౌన్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రా హుల్‌ గాంధీ అధ్యక్షత న ఆదివారం న్యూఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన ‘ఓట్‌ చోర్‌.. గ డ్డి చోడ్‌’ మహార్యాలీ లో గోదావరిఖనికి చెందిన ఎన్‌ఎస్‌యూ నేతలు పాల్గొన్నారు. ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆదేశాల మే రకు ఎన్‌ఎస్‌యూఐ నేషనల్‌ ప్రెసిడెంట్‌ వరుణ్‌ చౌదరి నేతృత్వంలో దాసరి విజయ్‌కుమార్‌, గుడికందుల రవి, నేరెళ్ల రమేశ్‌, రాహుల్‌, అరవింద్‌, మహేశ్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

అప్పుడు భర్త ఓటమి.. ఇప్పుడు భార్య గెలుపు

రామగుండం: అంతర్గాం మండలం రాయదండి గ్రామ పంచాయతీకి గ తంలో జరిగిన ఎన్నికల్లో సాదుల సదానందం ఓటమి పాలయ్యారు. తన ప్రత్యర్థి ధర్మాజి కృష్ణ ఒక్క ఓటుతో ఆయనపై గెలుపొందడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయినా మనస్తాపం చెందకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజల మధ్యే ఉన్నారు. గ్రామాభివృద్ధిలో పాలుపంచుకున్నారు. గ్రామస్తుల సమ స్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందా రు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సర్పంచ్‌ ఎన్నిక ల్లో బీసీ(మహిళ) రిజర్వు స్థానం నుంచి తన భార్య సాదుల స్వప్నను బరిలో నిలిపారు. ఆ మె తన సమీప ప్రత్యర్థి మేడి వసంతపై 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒక్క ఓటుతో ఓటమి పాలైన సదానందం.. తిరిగి సర్పంచ్‌ స్థానాన్ని తన సతీమణి స్వప్నతో భర్తీ చేయించారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ 1
1/3

పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ

పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ 2
2/3

పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ

పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ 3
3/3

పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement