చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు
పెద్దపల్లి: జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ధాన్యం రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో 333 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పటివరకు 62,756 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. వారినుంచి సేకరించిన ధాన్యం విలువ రూ.695 కోట్ల 18 లక్షలు కాగా ఇప్పటివరకు రూ.647 కోట్ల 50 లక్షలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
తినడానికి సన్నవడ్లు..
వానాకాలంలో అత్యధిక మంది రైతులు సన్నరకం వరి సాగుచేస్తారు. ఇందులో తినడానికి కొంత నిల్వచేసుకుని మిగతా ధాన్యం విక్రయిస్తారు. ఈసారి ఇప్పటివరకు సన్నరకం 2,53,418 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 37,438 మెట్రిక్ టన్నులను నిర్వాహకులు కొనుగోలు చేశారు. ధాన్యం విక్రయించిన రైతులకు 72 గంటల్లోనే ధాన్యం సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఎవరికై నా జమ కాకుంటే వెంటనే ఏఈవోలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
40 సేకరణ కేంద్రాల మూసివేత
93 శాతం మంది రైతులకు ధాన్యం డబ్బులు చెల్లింపు
రానివారు అధికారులను సంప్రదించాలి


