పల్లెలకు పట్టణ శోభ తెస్తాం
పెద్దపల్లిరూరల్: పల్లెలకు పట్టణ శోభ తీసుకొస్తామ ని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దబొంకూర్, రాఘవాపూర్, రంగాపూర్, కనగర్తి, పా లితం, కాసులపల్లి, తుర్కలమద్దికుంట గ్రామాల్లో ఆదివారం పంచాయతీ ఎన్నికల సభల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని అ భ్యర్థించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారు లు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే వారు కాంగ్రెస్ మద్దతుదారులనే గెలిపించుకోవాలని కోరారు. నాయకులు ఆడెపు వెంకటేశం, గంట రమేశ్, ముడుసు సాంబిరెడ్డి, కూ రమల్లారెడ్డి, ఇనుగాల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధిపై దృష్టి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పాలకవర్గం గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. మొట్లపల్లి పంచాయతీ పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. సర్పంచ్ తులా మనోహర్‌రావు, ఉపసర్పంచ్ బొమ్మల సుమలత – సదయ్య, వార్డుసభ్యులు దొమ్మటి శంకరమ్మ, పోశా లు, శారద, రమేశ్, రాజేశం, మానస, కాంగ్రెస్ నాయకులు దొమ్మటి రవి, శ్రీనివాస్, సంపత్, తిరుపతి, గాదర్ల వెంకటేశ్, ఎండీ ఫారూక్ పాల్గొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు


