ఓటుహక్కు వినియోగించుకున్నారా?
● వృద్ధురాలిని పలుకరించిన ఏసీపీ కృష్ణ
పెద్దపల్లి/ధర్మారం: ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఆదివారం సందర్శించారు. అక్కడ చేపట్టిన పోలీస్ బందోబస్తు తీరును తనిఖీ చేశారు. ఇదేసమయంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి ఓ వృద్ధురాలి వచ్చింది. ఏసీపీ కృష్ణ ఆమెను ఆప్యాయంగా పలుకరించారు. ఆ తర్వాత ఓటు వేశావా?, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి పోలీస్ సిబ్బంది సాయం చేశారా? ఆరోగ్య పరిస్థితి బాగుందా? అని అడిగి తెలుసుకొన్నారు. పోలీసులు ప్రజలకు సాయం ఉంటారని, ప్రజలందరూ ఇబ్బందులు లేకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఏసీపీ సూచించారు.


