జూబ్లీహిల్స్ తీర్పు రాజకీయాలకు దిశానిర్దేశం
ధర్మారం(ధర్మపురి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశమని మంత్రి అడ్లూరి ల క్ష్మణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవా రం నిర్వహించిన విజయోత్సవంలో మంత్రి మా ట్లాడారు. నవీన్‌యాదవ్ గెలుపు బలహీనవర్గాలదే అన్నారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తమ అభ్యర్థి గె లుపు కోసం తప్పుడు సర్వేలతో గెలుస్తున్నామని సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేదన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లాపుడ్య రూప్లా నాయక్, లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం చై ర్మన్ సంతోష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరె డ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అసోద అజయ్, నాయకులు సోగాల తిరుపతి, బొల్లి స్వామి, కొత్త నర్సింహులు, కాడే సూర్యనారాయణ, లావణ్య, అజయ్‌పాల్‌రెడ్డి, గంగారెడ్డి, జనార్దన్, సుమన్, బాబా పాల్గొన్నారు.
ప్రజా ప్రభుత్వానికే పట్టం
పెద్దపల్లిరూరల్: రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభు త్వం ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతోందని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్‌యాదవ్ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక జెండా కూడలిలో విజయోత్సవాలు జరుపుకున్నారు. రాబోయే స్థాని క ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చూపుతుందని అ న్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నే తలు ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఇక ఆ పార్టీ భవిష్యత్‌లో కనిపించదని అన్నారు.


