అద్దెకు సెల్లార్!
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని కొందరు షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు పార్కింగ్ కోసం వినియోగించాల్సిన సెల్లార్‌లను వ్యాపారాలకు అద్దెకిస్తున్నా రు. అందులో నిలపాల్సిన వాహనాలు రోడ్లపై పా ర్కింగ్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, గోదావ రిఖని తదితర ప్రాంతాల్లో ఈ దుస్థితి నెలకొంది.
నిబంధనలకు విరుద్ధం
జిల్లా కేంద్రంతోపాటు రామగుండం నగరం, ప్రధా న పట్టణాల్లో ఆస్పత్రులు, వ్యాపార, వాణిజ్య సముదాయాల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్లో సెల్లార్లు ఉన్నాయి. వీటిని వ్యాపారులకు అద్దె కు ఇస్తున్నారు. వాస్తవానికి షాపింగ్ కోసం వచ్చినవారు వాహనాలను పార్క్ చేసేందుకు సెల్లార్‌లను వినియోగించాలి.
అధికారులు ఏం చేస్తున్నారు?
సెల్లార్‌లో వ్యాపారాలు, ఆస్పత్రుల నిర్వహణ ప్రమాదకరమని తెలిసినా మామూలుగానే కొనసాగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా పోలీసు అధికారులు ఫొటోలు తీసి జరిమానా విధిస్తున్నారే తప్ప నియంత్రణకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్థానికులు వాపోతున్నారు.
జిల్లాలోని గోదావరిఖనిలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్‌లో ప్రైవేట్ ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇటీవల వైద్యాధికారులు తనిఖీ చేయగా ఇది వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్‌ను సెల్లార్ నుంచి వేరేచోటుకు మార్చాలని అధికారులు ఆదేశించారు.
నోటీసులు జారీచేశాం


