అతివేగం.. రహదారులు ఛిద్రం
పెద్దపల్లి: ఓవర్‌లోడ్, అతివేగం రహదారులను ఛిద్రం చేస్తున్నాయి. టిప్పర్లు లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామ శివారులో ప్రారంభమయ్యే రాజీవ్ రహదారి గోదావరిఖని సమీపంలోని గోదావరి వంతెన వద్ద ముగుస్తుంది. దీంతోపాటు జిల్లావ్యాప్తంగా విస్తరించిన అనేక మెయిన్‌రోడ్లపై వాహనాల రాకపోకలు మితమీరుతున్నాయి. 30 టన్నుల సామర్థ్యానికి బదులు కొన్నింట్లో 60 టన్నులూ తరలిస్తున్నారు.
కవర్లు కప్పకుండానే..
ఇసుక, బూడిద, మట్టి, ధాన్యం రవాణా చేసే వాహనాలపై కవర్లు కప్పడంలేదు. దుమ్ము, ధూళిపడి ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికళ్ల సమస్యతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. డస్ట్‌తో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు.
నిబంధనలు గాలికి
రోడ్డు, రవాణా శాఖ నిబంధనల ప్రకారం.. బూడి ద టిప్పర్లు 18 టన్నుల నుంచి 22 టన్నుల బరువు వరకే లోడ్ చేయాలి. కానీ 30 టన్నుల నుంచి 35 టన్నుల వరకు లోడ్‌చేసి రవాణా చేస్తున్నారు. గ్రానైట్, ధాన్యం తరలించే లారీల్లోనూ ఓవర్‌లోడ్ ఉంటోంది. అయినా, సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యహరించడం శోచనీయం.
ఆటోలు, ట్రాలీలు.. బస్సుల్లోనూ..
ఆటోలు, కార్లు, బస్సుల్లోనూ సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. ఒక్కో ఆటోలో 15 మంది నుంచి 20 మందిని తరలిస్తున్నారు. ఆ టోట్రాలీలు ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలపై నా ముగ్గురు నుంచి నలుగురు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ సామర్థ్యానికి మించి ప్ర యాణికులనుతరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అతివేగం.. రహదారులు ఛిద్రం


