పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వి ద్యార్థులకు కనీస వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన బోధన, శుచి, రుచికరమైన మధ్యాహ్నభోజనం అందిస్తున్నామని, తల్లిదండ్రులు పర్యవేక్షించి వారి భవిష్యత్ తీర్చిదిద్దాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కొత్తపల్లి జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవా రం నిర్వహించిన పేరేంట్, టీచర్ మీటింగ్‌లో మా ట్లాడారు. గైర్హాజరు విద్యార్థులను గుర్తించి క్రమం తప్పకుండా స్కూల్‌కు వచ్చేలా ప్రోత్సహించాలన్నా రు. పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా బోధించేలా పద్ధతుల్లో మార్పులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు చిన్నారులు కలెక్టర్‌కు పూలు అందించి ఆహ్వానం పలికారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల బలోపేతం చేయాలి
పెద్దపల్లి: స్వశక్తి మహిళా సంఘాలను బలోపేతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో సెర్ప్ కార్యకలాపాలపై ఆయన సమీక్షించారు. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం బ్యాంక్ లింకేజీ లక్ష్యం పూర్తి చేయాలని అన్నారు. మహిళా సంఘాల ద్వారా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. సీ్త్రనిధి రుణాల పంపిణీలో జిల్లా రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకు ఏపీఎం, డీపీఎంల కృషి ఎంతోఉందని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి గ్రామీణ అభివృద్ధి అధికారి నరేందర్, అదనపు డీఆర్డీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


